Devara : కరణ్ చేతికి దేవర.. ఇక బాలీవుడ్ విషయంలో డోకా లేదు!

Devara : టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా క్రేజీ చిత్రాల్లో ఒకటి ‘దేవర’. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా వైడ్ గా కామన్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ‘దేవర’ సమ్మర్ లో రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్ డిలే వల్ల సమ్మర్ నుండి దసరా కి వాయిదా పడింది. ఇక సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా దేవర ని లేట్ గా తీసుకు వచ్చినా కాలర్ ఎగరేసే సినిమాను తీసుకువస్తున్నామని ఎన్టీఆర్ ఓ వేదికపై చెప్పిన విషయం తెలిసిందే. ఇక సినిమాపై ట్రేడ్ వర్గాల్లో కూడా అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలే దర్శకుడు కొరటాల శివ ఈ కథ కోసమే చాలా టైం తీసుకున్నాడు. ఇక ఆచార్యతో డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టక తప్పని పరిస్థితి.

పాన్ ఇండియా ఆర్టిస్టులతో..

దేవర (Devara)లో హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ కు RRR సినిమా తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది. అయితే అందులో మరో హీరోగా రామ్ చరణ్ నటించగా, రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ కూడా కలిసి వచ్చింది. కాబట్టి ఎన్టీఆర్ ఇప్పుడు సోలోగా సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ తో ఓ రేంజ్ అంచనాలను క్రియేట్ చేసిన మేకర్స్, త్వరలోనే ఒక్కొక్కటిగా పాటలని కూడా రిలీజ్ చేయబోతున్నారు. అందుకే పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్ల కోసం ఇప్పట్నుంచే కసరత్తులు చేస్తున్నారు. ఇక అన్ని భాషలకు సంబంధించి బిజినెస్ లెక్క కూడా ఇప్పట్నుంచే మొదలుపెట్టగా,ముఖ్యంగా హిందీలో ఈ సినిమాను ఎలా ప్రమోట్ చేస్తారు అనే డౌట్స్ మొదటి నుంచి ఉన్నాయి. సినిమాలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్, జాన్వీ నటిస్తున్నప్పటికి బిజినెస్ పరంగా హిందీ మార్కెట్ చాలా ముఖ్యం. అక్కడ క్లిక్ అయితే తెలుగుతో సమానమైన వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది.

హిందీ వెర్షన్.. కరణ్ జోహార్ బాధ్యత..

అయితే తాజా అప్డేట్ తో మేకర్స్ హిందీలో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అన్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఎందుకంటే ఈ సినిమాను నార్త్ లో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేయబోతున్నారు. తనతో పాటు ఏఏ ఫిలిమ్స్ ఇండియా వాళ్ళు భాగం కాబోతున్నారు. నార్త్ స్టేట్స్ కు సంబంధించిన రిలీజ్ హక్కులను కరణ్ జోహార్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక కరణ్ జోహార్ చేసే సినిమా ప్రమోషన్లు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ దిల్ రాజు ఎలాగో, అక్కడ కారం ఆ రేంజ్ లో ప్రమోట్ చేస్తారు. ఇక హిందీలో థియేటర్స్ కూడా గట్టిగానే లభించే అవకాశం ఉంది. గతంలో కరణ్ జోహార్ బాహుబలి, RRR సినిమాలకు ఏ విధంగా ప్రమోట్ చేసారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక దేవర సినిమాను కూడా అదే రేంజ్ లో ప్రమోట్ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు