Pushpa The Rule : యూట్యూబ్ లెక్కలపై ఇంత రచ్చ అవసరమా.. తెలిసిందేగా?

Pushpa The Rule : టాలీవుడ్ లో ఈ మధ్య స్టార్ హీరోల అభిమానుల మధ్య వివాదాలు ముదిరిపోతున్నాయి. ప్రతి చిన్న విషయానికి కంపారిజన్ తో గొడవలు వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా లో మరింత రచ్చ చేస్తున్నారు. కలెక్షన్ల గురించి, సినిమాల గురించే కాకుండా, ఇప్పుడు యూట్యూబ్ రచ్చ కూడా పీక్స్ కి చేరుతుంది. యూట్యూబ్ లో టీజర్ రికార్డులని, ట్రైలర్ రికార్డుల పేరిట ఏ సినిమాకి ఎన్ వ్యూస్ వచ్చాయి అని ఫ్యాన్స్ లెక్కలేస్తూ సోషల్ మీడియా లో ట్రోలింగ్ కి దిగుతున్నారు. ఈ వివాదం కొన్నాళ్ళు సైలెంట్ కాగా, తాజాగా మళ్ళీ పీసుహాప ద్వారా రచ్చ లేపారు. మొన్నామధ్య అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పుష్ప 2 ది రూల్ టీజర్ లో ఊహించని గెటప్ తో బన్నీని చూపించిన విధానం షాక్ ఇచ్చిన మాట నిజమే, కానీ అంతకు ముందే ఆ లుక్ తో స్టిల్ రావడం వల్ల ఫ్యాన్స్ అంతకు మించి ఊహించుకున్నారు కాబట్టి, కొంత అసంతృప్తికి గురయ్యారు. అయితే దర్శకుడు సుకుమార్ కావాలనే ఒక ప్లాన్ ప్రకారం హైప్ ని బిల్డ్ చేసే క్రమంలో అసలు కంటెంట్ ని ఇంకా బయటికి వదల్లేదనే వార్తలు వస్తున్నాయి.

మేకర్స్ మిస్టేక్ అయినా.. ఇదంతా మార్కెటింగ్.?

ఇదిలా ఉండగా పుష్ప యూట్యూబ్ రికార్డులపై మాత్రం మేకర్స్ రచ్చ లేపినట్లయింది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ లో ఈ వీడియోకు వచ్చిన వ్యూస్ మీద సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. రెండు రోజుల్లో వచ్చిన 88 మిలియన్ వీక్షణలు నిజం కాదనేది టాపిక్. మాములుగా ప్యాన్ ఇండియా సినిమాలు వివిధ మార్గాల్లో స్టార్ హీరోల అభిమానుల కోసం వ్యూస్ ఎక్కువ వచ్చేలా కొంతమంది రకరకాల ఎత్తుగడలు వేసుకుంటారు. ఇది అందరూ చేసేదే. థర్డ్ పార్టీ ద్వారా కాంట్రాక్టు తీసుకుని వివిధ మార్గాల్లో పెంచుకోవడం ఒకటైతే, ప్రత్యేకమైన పిఆర్ టీమ్ ని ఏర్పాటు చేసుకుని దీని మీదే వర్క్ చేస్తూ రికార్డులు వచ్చేలా చూసుకోవడం మరో స్ట్రాటజీ. అఫీషియల్ గా యాడ్స్ ని జొప్పించడం ద్వారా పెంచడమనే ఇంకో పద్ధతి కూడా అమలులో ఉంది. ఇవి కాకుండా సింపుల్ గా అప్లోడ్ చేసి నిజాయితీగా రియల్ టైం వ్యూస్ అని ఎన్ని వ్యూస్ వస్తాయనేది వ్యూయర్స్ కి వదిలిపెట్టడం ఇంకో రకం. ఇలా చాలా రకాలుగా టీజర్ లెక్కలు వేస్తున్నారు. నిజానికి భారీ రికార్డులు సృష్టించాల్సిన పుష్ప ది రూల్ కాస్త నిరాశ పరచడం వల్ల, యూట్యూబ్ లో కొన్ని రికార్డులని దాటలేకపోయింది. 24 గంటల రికార్డులలో ప్రభాస్ రాధే శ్యామ్ టీజర్ (42 M) కి ఎక్కువ వ్యూస్ రాగా, పుష్ప కి 39 M వ్యూస్ వచ్చాయి. కానీ మేకర్స్ ఎక్కువ వేశారు. అయితే ఇది కూడా ఒకరకమైన పప్రమోషన్ అయిపొయింది. అప్పట్లో ఫేక్ కలెక్షన్లు ఎలా చూపించేవారో ఇప్పుడు యూట్యూబ్ లెక్కలు కూడా అలా చూపిస్తున్నారు.

రచ్చ అనవసరమంటే.. కలెక్షన్లలో ఫోకస్..

ఇదిలా ఉండగా పుష్ప (Pushpa The Rule)టీజర్ రికార్డుల గురించి వాదన అనవసరం. రికార్డులు నిజం కానప్పుడు, అలాంటప్పుడు ఆధారాలు లేకుండా వ్యూస్ ఒరిజినల్ కాదని ఫేకని ప్రాపగండా చేయడం ఎంత వరకు కరెక్టని పలువురు అభిమానుల మాట. అయినా పుష్ప బ్రాండ్ కి ప్రత్యేకంగా మార్కెటింగ్ అవసరం లేదు. బోలెడు క్రేజ్ ఉంది. ఉత్తరాదిలోనూ భారీ రేట్లతో కొనేందుకు బయ్యర్లు సిద్ధంగా ఉన్నారు. ఆగస్ట్ 15 ఇంకా దూరంలో ఉంది. ట్రైలర్, లిరికల్ వీడియోస్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా బోలెడు ప్రమోషన్లు రావాల్సి ఉంది. ఇప్పుడు పుష్ప టీజర్ మీద ఇంత చర్చ అవసరం లేదన్నది అభిమానుల వాదన. ఇదంతా పక్కన పెడితే కలెక్షన్లలో ఫోకస్ పెడుతున్నారు ఫ్యాన్స్. టీజర్ రికార్డులు పిఆర్ లను పెట్టుకుంటే వస్తుంది గాని, కలెక్షన్లు అలా రావుగా, అప్పుడు చూద్దాం అని ఆయా స్టార్ హీరోల అభిమానులు వాదిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు