Geethanjali Malli Vachindi : గీతాంజలికీ ఇదే అడ్వాంటేజ్..

Geethanjali Malli Vachindi : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ తెలుగమ్మాయి అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి కథాబలం ఉన్న సినిమాలు చేసే హీరోయిన్లలో ముందుండే ఈ భామ తాజాగా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమాతో ఆడియన్స్ ని పలకరించడానికి వచ్చింది. పదేళ్ల కింద గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా “గీతాంజలి మళ్ళీ వచ్చింది” సినిమా రిలీజ్ అవుతుంది. ఇక హారర్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ట్రైలర్ లతో మెప్పించగా, సినిమా రెగ్యులర్ ఫార్మాట్ లోనే తెరకెక్కుతోందని తెలిసిపోతుంది. అయితే ఫస్ట్ పార్ట్ లో కాస్త నవ్వించే ప్రయత్నం ఎక్కువ చేసిన మేకర్స్ , ఈ సీక్వెల్ లో ఎక్కువగా భయపెట్టాలని ట్రై చేస్తున్నారు. ఇక ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో దేని మీద విపరీతమైన అంచనాలు లేవు కానీ, ఉన్నంతలో సౌండ్ వినిపిస్తోంది గీతాంజలి మళ్ళీ వచ్చింది గురించే. శివ తుర్లపాటి దర్శకత్వంలో రచన బాధ్యతలతో పాటు నిర్మాణ భాగస్వామ్యం పంచుకున్న కోన వెంకట్ దీనికి అంతా దగ్గరుండి ముందు నడిపిస్తున్నారు.

ప్రమోషన్లలో ముందున్న గీతాంజలి..

ఇక చిన్న సినిమా అయినా, ఈ సినిమా ప్రమోషన్ల కోసమే హీరోయిన్ అంజలి గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్ లోనే ఉంటూ ఈవెంట్లు, ఇంటర్వ్యూలంటూ సందడి చేస్తోంది. దాంతో పాటు చిత్ర ప్రధాన నటీనటులు కూడా ఈ ప్రమోషన్లలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇక రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సినిమా గురించి మంచి మార్కెటింగ్ చేసారు చిత్ర యూనిట్. కామెడీ హారర్ జానర్ లో రూపొందిన ఈ ఎంటర్టైనర్ లో టాలీవుడ్ ప్రముఖ కమెడియన్లు ఎక్కువా నటించారు. ఇక ఈ సినిమాకు ఈ వారం అనూహ్యాంగా పెద్దగా పోటీ ఉండకుండా, క్రేజ్ పరంగా మంచి అడ్వాంటేజ్ లభించిందని చెప్పాలి. ఈ వారం ఐదు సినిమాలు రిలీజ్ అవుతుండగా అందులో గీతాంజలి (Geethanjali Malli Vachindi) కి ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది.

ఒక్కదానికి బజ్ లేదు..

ఈ వారం రెండు తెలుగు సినిమాలతో పాటు మూడు ఇతర భాషల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే గీతాంజలికి ఈ వారం మంచి ఛాన్స్ దొరికింది. సినిమాల పోటీ పరంగా చూస్తే విజయ్ ఆంటోనీ లవ్ గురుని మైత్రి సంస్థ పంపిణి చేస్తోంది. బిచ్చగాడు సిరీస్ తప్ప హీరోగా వచ్చిన అన్ని సినిమాలు తెలుగులో నిరాశపరిచాయి.ఏదైనా అనూహ్యమైన టాక్ వస్తే తప్ప నిలదొక్కుకోవడం కష్టం. పైగా కంటెంట్ బాగున్నా రిలీజ్ రోజు టాక్ వస్తేనే నిర్ధారణకు రాగలం. ఇక సుహాస్ నటించిన శ్రీరంగనీతులు సినిమాకి అసలు ఎలాంటి బజ్ లేదు. ఎందుకో పబ్లిసిటీ కూడా చిత్ర యూనిట్ సీరియస్ గా చేయకపోవడం ప్రభావం చూపిస్తోంది. మరోవైపు బాలీవుడ్ మూవీస్ బడేమియా చోటేమియా, మైదాన్ లు బరిలో ఉన్నా, తెలుగు బిసి సెంటర్స్ లో వాటి ఎఫెక్ట్ అంతగా ఉండదు. ఈ నేపథ్యంలో గీతాంజలి మళ్ళీ వచ్చింది కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈజీగా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు అందుకోవచ్చు. మరి గీతాంజలి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు