Geethanjali2: దిల్ రాజు చేతికే హక్కులు.. ఇక ప్రమోషన్లు చూసుకుంటాడులే..!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ తెలుగమ్మాయి అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి కథాబలం ఉన్న సినిమాలు చేసే హీరోయిన్లలో ముందుండే ఈ భామ పదేళ్ల కింద గీతాంజలి అనే సినిమాతో వచ్చి మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. హారర్ కామెడీ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమాను రాజ్ కిరణ్ డైరెక్ట్ చేయగా, కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించాడు. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమాకు సీక్వెల్ గా “గీతాంజలి మళ్ళీ వచ్చింది” అనే పేరుతో సినిమా వచేస్తుంది. ఇక ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా కామెడీ, ఇంకా హారర్ ఎలిమెంట్స్ తో బాగుండి మెప్పిస్తుంది. అయితే సినిమా రెగ్యులర్ ఫార్మాట్ లోనే తెరకెక్కుతోందని టీజర్ చూస్తే తెలిసిపోతుంది. అయితే ఫస్ట్ పార్ట్ లో కాస్త నవ్వించే ప్రయత్నం ఎక్కువ చేసిన మేకర్స్ , ఈ సీక్వెల్ లో ఎక్కువగా భయపెట్టాలని ట్రై చేస్తున్నట్టు అనిపించింది.

పాత కథే కొత్త ట్రీట్మెంట్..

ఇక గీతాంజలి సినిమాలో ఫస్ట్ మూవీలో ఉన్న సగం మంది ఆర్టిస్ట్ లు ఈ సీక్వెల్ లో కూడా ఉన్నారు. ఇక ఈ సీక్వెల్ లో సినిమా ఆర్టిస్ట్ లు కొందరు ఒక హారర్ సినిమా తీయడానికి ఒక పాత పాడుబడ్డ మహల్ కి వెళ్తారు. అక్కడ వాళ్లకి ఎదురైన ఇబ్బంది ఏమిటి, అసలు ఆ మహల్ బ్యాక్ స్టోరీ ఏంటి? అన్నదే కథ. మనం చాలా సార్లు చూసిన సినిమాల్లోని కథే అయినా, డైరెక్టర్ తన స్క్రీన్ ప్లే తో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. ఇక ఫస్ట్ పార్ట్ కి రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తే ఈ సీక్వెల్ కి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా ని కోన వెంకట్ నిర్మిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, ఎంవివి సత్యనారాయణ సహా నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఇక అంజలి 50వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 11న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేసారు. నిజానికి మార్చి 22నే సినిమా రావాల్సి ఉండగా సోలో రిలీజ్ కోసం వాయిదా వేసినట్టు తెలుస్తుంది.

- Advertisement -

దిల్ రాజు చేతికి గీతాంజలి2 రైట్స్..

ఇక గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా నైజాం హక్కులు ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నాడు. అయితే అది ఎంత మొత్తానికి అన్న విషయంపై క్లారిటీ లేదు. నైజాం రైట్స్ అంటే సినిమా కంటెంట్ ని బట్టి 2 కోట్లకి అటు ఇటుగా అయివుండొచ్చు. అయితే గీతాంజలి 1 కూడా దిల్ రాజే రిలీజ్ చేయడం జరిగింది. పైగా ఆ సినిమాలో దిల్ రాజు స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సెంటిమెంట్ గా కోన వెంకట్ దిల్ రాజుని ఈ సీక్వెల్ లో కూడా నటించమని చెప్పగా దిల్ రాజు తన రియల్ లైఫ్ క్యారెక్టర్ తోనే నటించాడని సమాచారం. ఇక సినిమాలో 5 నిమిషాల వరకు దిల్ రాజు ఉంటాడట. ఇక దిల్ రాజు చేతికి ఏదైనా సినిమా వెళ్లిందంటే దాని ప్రమోషన్లు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. లీగల్ గ ఆల్మోస్ట్ ఆ సినిమాకి ఏ ఇబ్బందులు ఉండవు. ప్లాప్ అయ్యే సినిమాలకు కూడా తన మార్కెటింగ్ ప్రమోషన్లతో మంచి ఓపెనింగ్స్ వచ్చేలా చేస్తాడు. అందుకని మార్కెటింగ్ ప్రమోషన్ విషయంలో గీతాంజలి 2 మేకర్స్ హ్యాపీగా ఉండొచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అంజలి మెయిన్ లీడ్ గా నటించగా, సునీల్, అలీ, రవి శంకర్, శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, సత్య, బ్రహ్మాజీ, రాహుల్ మాధవ్ కీలకపాత్రల్లో నటించారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు