Geethanjali Malli Vachindi Trailer Talk : గీతాంజలి.. ఈసారి కాస్త భయపెడుతుందట!

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో ఒకరైన తెలుగమ్మాయి అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి కథాబలం ఉన్న సినిమాలు చేసే హీరోయిన్లలో ముందుండే ఈ భామ పదేళ్ల కింద గీతాంజలి అనే సినిమాతో వచ్చి మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. హారర్ కామెడీ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమాను రాజ్ కిరణ్ డైరెక్ట్ చేయగా, కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించాడు. అయితే మళ్ళీ పదేళ్ల తర్వాత “గీతాంజలి మళ్ళీ వచ్చింది” పేరుతో సీక్వెల్ తీశారు మేకర్స్. ఈ మధ్యనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, తాజాగా కాసేపటికిందే టీజర్ ని రిలీజ్ చేయడం జరిగింది.

టీజర్ మొత్తాన్ని చూసాక ఎప్పుడూ చూసే రెగ్యులర్ ఫార్మాట్ లోనే ఈ సినిమా తెరకెక్కుతోందని తెలిసిపోతుంది. అయితే ఫస్ట్ పార్ట్ లో కాస్త నవ్వించే ప్రయత్నం ఎక్కువ చేసిన మేకర్స్ , ఈ సీక్వెల్ లో ఎక్కువగా భయపెట్టాలని ట్రై చేస్తున్నట్టు అనిపించింది. ఇక సినిమాలో ఫస్ట్ మూవీలో ఉన్న సగం మంది ఆర్టిస్ట్ లు ఈ సీక్వెల్ లో కూడా ఉన్నారు. టీజర్ లో కొందరు మూవీ యూనిట్ ఒక హారర్ సినిమా తీయడానికి ఒక పాత పాడుబడ్డ మహల్ కి వెళ్తారు. అక్కడ వాళ్లకి ఎదురైన ఇబ్బంది ఏమిటి, అసలు ఆ మహల్ బ్యాక్ స్టోరీ ఏంటి? అన్నదే కథ. మనం చాలా సార్లు చూసిన సినిమాల్లోని కథే అయినా, డైరెక్టర్ తన స్క్రీన్ ప్లే తో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

ఇక ఫస్ట్ పార్ట్ కి రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తే ఈ సీక్వెల్ కి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా ని కోన వెంకట్ నిర్మిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, ఎంవివి సత్యనారాయణ సహా నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. అంజలి 50వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2024 మార్చి 22న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ టీజర్ లో అంన్నౌన్సు చేసారు. ఇక ఈ సినిమాలో అంజలి మెయిన్ లీడ్ గా నటించగా, సునీల్, అలీ, రవి శంకర్, శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, సత్య, బ్రహ్మాజీ, రాహుల్ మాధవ్ కీలకపాత్రల్లో నటించారు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు