Kannappa Shooting Update : ఆశలన్నీ ఈ సినిమాపైనే , అక్షయ్ కుమార్ సీన్స్ పూర్తి

Kannappa Shooting Update : ప్రతి నటుడికి అలానే దర్శకుడు కి కూడా తన జీవితంలో చేయాల్సిన డ్రీం ప్రాజెక్ట్ అంటూ ఒకటి ఉంటుంది. అలా మంచు విష్ణు కి ఉన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే భక్తకన్నప్ప. ఈ కథ మనందరికీ తెలిసిందే అయితే ఈ కథను వెండితెరపై ఆవిష్కరించాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు మంచు విష్ణు. దాన్ని భారీ బడ్జెట్ తో మొదలుపెట్టాడు. రీసెంట్ టైమ్స్ లో మంచి విష్ణు ఫ్యామిలి నుంచి వస్తున్న సినిమాలకి సరైన ఆదరణ దక్కటం లేదు. ఒకప్పుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే తన సినిమాలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.

మోహన్ బాబు కి విలక్షణ నటుడు అని గుర్తింపు కూడా ఉంది. అయితే ఆ తర్వాత కాలంలో మోహన్ బాబు చేసిన సినిమాలకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. దీనికి కారణం వీళ్ళు బయట కొన్ని మాట్లాడే మాటలు అలానే చాలా పెద్దవారిని కూడా వాడు వీడు అంటూ సంబోధించడం. ఇవన్నీ కూడా చాలామందికి ఎబ్బెట్టుగా అనిపించాయి. వీళ్ళ ఫ్యామిలీ పై కొంతమంది ట్రోల్స్ కూడా చేశారు. ఇకపోతే భక్తకన్నప్ప సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి

విష్ణు మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘భక్త కన్నప్ప’లోకి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రీసెంట్ గా జాయిన్ అయిన విషయం తెలిసిందే. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో రెండు భారీ షెడ్యూల్స్‌ను కంప్లీట్ చేశారు.

- Advertisement -

రీసెంట్ ఈ మూవీ షూటింగ్ హైద్రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ సంబంధించి బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సీన్స్ కంప్లీట్ అయిపోయాయి. ప్రస్తుతం పాన్ ఇండియా హావ నడుస్తున్న టైం లో ఈ సినిమాను కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. జెన్యూన్ గా సినిమా అవుట్ ఫుట్ బాగా వస్తే కథను నమ్మి, మంచి సినిమాను ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుంది. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్రానికి రచయితలుగా పనిచేస్తున్నారు. కన్నప్ప కథను అందరికీ తెలియపర్చే విధంగా కామిక్ బుక్స్‌ని కూడా రిలీజ్ చేయగా.. వాటికి మంచి స్పందన వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు