Nivetha Thomas : తెరపైకి ఉత్తరాంధ్ర కళాకారిణి బయోపిక్

కొన్ని కథలు ఊహల్లో నుంచి పుడతాయి. మరికొన్ని కథలు పుస్తకాల్లో నుంచి పుడతాయి. ఇంకొన్ని కథలు జీవితాల్లో నుంచి పుడతాయి. అయితే జీవితాల్లో నుంచి పుట్టిన కొన్ని కథల్ని బయోపిక్స్ పేరుతో తెరకెక్కిస్తుంటారు కొంతమంది దర్శకులు. ఇప్పటివరకు చాలా బయోపిక్ సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాయి. అంతే కాకుండా మిగతా ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాలు ఉన్నాయి.

బాగ్ మిల్కా బాగ్, గాంధీ, సంజు, ధోని వంటి సినిమాలు హిందీలో ఘనవిజయాన్ని సాధించాయి. తెలుగులో బయోపిక్ విషయానికి వస్తే.. తెలుగులో ఎన్ని బయోపిక్స్ వచ్చినా కూడా వాటన్నిటికీ మించి మహానటి అనే సినిమా పీక్ రేంజ్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్న పరిణామాలు దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రధాన అంశంగా తీసుకొని చాలా బయోపిక్ సినిమాలను కూడా తెరకెక్కాయి.

ఇక అసలు విషయానికి వస్తే ఒక సాధారణ మనిషి తను సాధించిన అచీవ్మెంట్స్ ని పరిగణలోకి తీసుకొని వాళ్ళ కథను కొంతమందికి చెప్తే బాగుంటుంది అని కొంతమంది దర్శకులు ముందుకు వస్తున్నారు. అలానే మల్లేశం అని సినిమాను తెరకెక్కించారు. గతంలో మయూరి అనే సినిమా కూడా వచ్చింది. ఇకపోతే ఇప్పుడు ఉత్తరాంధ్ర కళాకారిని అయిన పెద్ద గరివిడి లక్ష్మి బయోపిక్ ను సినిమాగా తెరకెక్కించబోతున్నట్లు తెలుగు ఫిలింనగర్ లో వార్తలు చక్కెరలు కొడుతున్నాయి. అయితే దీని గురించి అధికారిక ప్రకటన ప్రస్తుతానికైతే లేదు. కానీ ఈ సినిమాలో నివేద థామస్ గరివిడి లక్ష్మి పాత్రలో కనిపించబోతుంది అని కథనాలు వస్తున్నాయి.

- Advertisement -
Nivetha Thomas in Garividi Lakshmi's biopic
Nivetha Thomas in Garividi Lakshmi’s biopic

ఈ సినిమాతో గౌరీ నాయుడు అనే ఒక కొత్త దర్శకుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. అయితే గతంలో ఈ దర్శకుడు యాత్ర సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్న మహి వీ రాఘవ దగ్గర యాత్ర, ఆనందోబ్రహ్మ సినిమాలకు పని చేసినట్లు తెలుస్తుంది. అయితే రీసెంట్ టైమ్స్ లో ఉత్తరాంధ్ర యాస ఎంతగా ప్రాచుర్యం పొందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చాలా సినిమాల్లో పాటలను కూడా అదే విధంగా వాడుతున్నారు. అక్కడ జానపదాలను కూడా రీసెంట్ గా సినిమాలలో వింటూ వస్తున్నాం. బుర్రకథ నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి చాలామంది ప్రేక్షకులకు ఆ నేపథ్యంలోని పాటలను వింటే ఒక కొత్త అనుభూతి కలుగుతుందని చెప్పొచ్చు. ఈ సినిమా మ్యూజికల్ గా కూడా మంచి హిట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు గురించి అధికార ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

Nivetha Thomas in Garividi Lakshmi's biopic
Nivetha Thomas in Garividi Lakshmi’s biopic

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు