Ajnali: ‘గీతాంజలి’ మళ్ళీ వస్తుందిలే’ గాని.. ఆ పోస్టరేంటి భయ్యా?

టాలీవుడ్ లో ఏ మధ్య కథల్లేకనో లేక హిట్ అయిన సినిమాల క్రేజ్ క్యాష్ చేసుకుందామనో సీక్వెల్స్ ట్రెండ్ మరీ ఎక్కువయిపోయింది. పెద్ద సినిమా, చిన్న సినిమా అన్న తేడా లేకుండా అందరు మూవీ మేకర్స్ ఈ మధ్య సీక్వెల్ మూవీస్ చేస్తున్నారు. ఇక రాబోతున్న సీక్వెల్ సినిమాల్లో లాస్ట్ ఇయరే ప్రారంభమైన “గీతాంజలి మళ్ళీ వచ్చింది” కూడా ఒకటి. తెలుగమ్మాయి అంజలి నటించిన గీతాంజలి అనే సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతుంది ఈ సినిమా.

ఇక ఈ సినిమా అంజలి మెయిన్ లీడ్ గా తెరకెక్కుతున్న హార్రర్ సినిమా కాగా, తాజాగా న్యూ ఇయర్ స్పెషల్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అయ్యాక పోస్టర్ పై మాత్రం ఆశించినంత పాజిటివ్ రెస్పాన్స్ మాత్రం రాలేదు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే చంద్రముఖి లో జ్యోతిక స్టిల్ ని గుర్తుచేస్తుంది. ఇక ఈ పోస్టర్ ని ట్రోల్ చేస్తూ నెటిజన్లు గీతాంజలి సీక్వెలా? లేక మళ్ళీ చంద్రముఖి సీక్వెలా? అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా కి కోన వెంకట్ నిర్మిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, ఎంవివి సత్యనారాయణ సహా నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఇక ముందున్న సినిమాలో నటులే ఈ సినిమాలో నటిస్తుండగా, ఈ సినిమాను 2024 జులై లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక అంజలి గేమ్ ఛేంజర్ షూటింగ్ లో పాల్గొంటూనే, ఈ సినిమా షూటింగ్ కి కూడా డేట్లు కేటాయిస్తుంది.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు