Varalakshmi Sarath Kumar : పెళ్లి కాకముందే వరలక్ష్మీకి కాబోయే భర్త గిఫ్ట్… ఏమిచ్చాడో అస్సలు ఊహించలేరు

Varalakshmi Sarath Kumar : వరలక్ష్మి శరత్ కుమార్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఐరన్ లెగ్ గా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం లక్కీ గర్ల్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమె చిన్న పాత్ర చేసినా చాలు సినిమా హిట్ అన్నట్టుగా మారింది పరిస్థితి. ఇక ప్రస్తుతం 38 ఏళ్ల వయసున్న వరలక్ష్మి శరత్ కుమార్ తన బాయ్ ఫ్రెండ్ నికోలాయ్ సచ్‌దేవ్‌ ను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతోంది. ఇటీవల వీళ్ళ నిశ్చితార్థం జరగగా, పెళ్లి కంటే ముందే తన బాయ్ ఫ్రెండ్ వరలక్ష్మికి సర్ప్రైజ్ ల వర్షం కురిపిస్తున్నట్టుగా సమాచారం. మరి వరలక్ష్మికి బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన ఆ భారీ గిఫ్ట్ ఏంటి? అంటే..

కోట్ల విలువైన బంగ్లా గిఫ్ట్..

నికోలాయ్ ముంబైలో వరలక్ష్మి కోసం రెండు బంగ్లాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ బంగ్లాలలో అన్ని విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయని, వాటి ధర కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని కూడా చెబుతున్నారు. ఈ సమాచారం వరలక్ష్మి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. పెళ్లికాక ముందే ఈ రేంజ్ లో ప్రేమ కురిపిస్తే, పెళ్లయ్యాక వరలక్ష్మిని ఇంకెంత హ్యాపీగా చూసుకుంటాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా నికోలాయ్ కి ఇప్పటికే వివాహం కాగా, మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ ను రెండవ వివాహం చేసుకోబోతున్నాడు.

నిశ్చితార్థంతో రూమర్స్ కు ఫుల్ స్టాప్

వరలక్ష్మి ఇదివరకు విశాల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ పుకార్లన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఇటీవలే వరలక్ష్మి, నికోలాయ్ నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. త్వరలో జంట పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి వరలక్ష్మి తన బాయ్ ఫ్రెండ్ తో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టే ఛాన్స్ ఉంది.

- Advertisement -

రెండో పెళ్లి అంటూ ట్రోలింగ్

ఇక వరలక్ష్మి, నిక్ పెళ్లి ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. వరలక్ష్మి రెండో పెళ్లి వాడిని చేసుకోవడం ఏంటి అంటూ దారుణంగా విమర్శించారు. రీసెంట్ గా శబరి మూవీ ప్రమోషన్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్ తనకు కాబోయే భర్త గురించి వచ్చిన ట్రోలింగ్ పై స్పందించింది. అతడు నాకు హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. రెండో పెళ్లి అంటే నిక్ ఒక్కడే చేసుకోవట్లేదు కదా మా నాన్న కూడా రెండు సార్లు చేసుకున్నారు అంటూ ఏకంగా తన తండ్రిని ఉదాహరించింది. ఆయన ఆనందంగా ఉంటే చాలు ట్రోలింగ్ గురించి నేను పట్టించుకోను అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. అంతేకాకుండా నిక్ మాజీ భార్య, అతని కూతురు తనకు తెలుసని చెప్పుకొచ్చింది. నిక్ కూతురు పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిందని, ఆయన 14 ఏళ్ల నుంచి తనకు తెలుసని వెల్లడించింది. జీవితాంతం తాను నిక్ తో సంతోషంగా గడపగలను అన్న నమ్మకం ఉంది కాబట్టే అతని పెళ్లి చేసుకుంటున్నానని వివరించింది ఈ బ్యూటీ. ఇక వరలక్ష్మి శబరి అనే సినిమాతో మే 3న థియేటర్లలోకి రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు