#ARRPD6 : పాతికేళ్ల తర్వాత మళ్లీ ఆ కాంబినేషన్

#ARRPD6 : ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కు ఉండే ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అటువంటి వాటిలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ప్రభుదేవా కొరియోగ్రఫీ ఒకటి ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కి ప్రభుదేవా చేసిన డ్యాన్సులు గాని కొరియోగ్రఫీ కానీ ఇప్పటికీ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అయితే దాదాపు పాతికేళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఒక సినిమాకి పనిచేయబోతున్నారు.

ఇదివరకే చాలా సందర్భాల్లో ఒకరి గురించి ఒకరు చెబుతూ వచ్చారు. ఒక ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ ప్రభుదేవా అద్భుతమైన డాన్సర్ అని, రోమియో మరియు లవ్ బర్డ్స్ అనే సినిమాలను కంపోజ్ చేస్తున్న టైంలో ప్రభుదేవా చేసే డ్యాన్సులు తనకు ఇన్స్పిరేషన్ అంటూ చెప్పుకొచ్చాడు రెహమాన్. అలానే చికుబుకు చికుబుకు రైలే అని పాటను చూసినప్పుడు స్క్రీన్ మీద నుంచి డైరెక్ట్ గా తన పైకి దూకుతాడేమోనని భయపడ్డాను అంటూ రెహమాన్ ఒక ఇంటర్వ్యూలో చాలా ఫన్నీగా చెప్పుకొచ్చారు.

అదే విధంగా రెహమాన్ సంగీతానికి డాన్స్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేయడం తనకి ఎప్పుడూ ఒక సవాల్ తో కూడుకున్న పని అని ప్రభుదేవా చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. అయితే వీరిద్దరిని మనోజ్ ఎన్ఎస్ అనే దర్శకుడు మళ్ళీ కలిసేలా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా గురించి ప్రస్తుతానికి పూర్తి సమాచారం ఇంకా లేదు. #ARRPD6 అనే పేరుతో ఈ సినిమాను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫొటోస్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు ఏ ఆర్ రెహమాన్. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.

- Advertisement -

ప్రభుదేవాతో పాటు, ఈ చిత్రంలో యోగి బాబు, అజు వర్గీస్, అర్జున్ అశోక్, సాట్జ్, నిష్మా చెంగప్ప, సుష్మితా నాయక్, రెడున్ కింగ్స్లీ, మొట్టై రాజేంద్రన్, సింగ్ంపులి, లొల్లు సభ స్వామినాథన్, TSR శ్రీనివాసన్, రామర్, దీపా శంకర్, డా. సంతోష్ జాకబ్ కూడా నటిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు