Music director: సినీ ఇండస్ట్రీలో విషాదం.. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి..!

Music director.. ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా చిన్న వయసు వారే స్వర్గస్తులవుతూ అందరిని దుఃఖానికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సెలబ్రిటీ మరణ వార్త అందరిని కలిచి వేసింది. తమిళ యువ సంగీత స్వరకర్త ప్రవీణ్ కుమార్ అనారోగ్య కారణాలతో ఒమంతురార్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు..అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 6:30 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సినీ పరిశ్రమలో యువ సంగీత స్వరకర్త గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈయన.. అనారోగ్య కారణాలతో 28 సంవత్సరాల వయసులోనే మరణించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. ముఖ్యంగా ఈయన మరణానికి సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది..

Music director: Tragedy in the film industry.. Young music director died..!
Music director: Tragedy in the film industry.. Young music director died..!

సొంత ఊరిలో అంత్యక్రియలు..

సినిమా ఇండస్ట్రీలో విజయాలు సాధించిన వారెవరు కూడా అంత తేలికగా ఉన్నత శిఖరాలకు చేరుకోలేదు.. ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని చిత్ర సీమలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.. ఈ క్రమంలోనే ప్రవీణ్ కుమార్ కూడా ఎన్నో సవాళ్లను అధిగమించి తమిళ చిత్ర పరిశ్రమలో సంగీతం అందించే అవకాశాన్ని అందుకున్నారు.. ఇక ఈయన రాకతాన్, మేడక్ లాంటి హిట్ సినిమాలకు సంగీతాన్ని అందించిన ప్రవీణ్ కుమార్.. ఈయన సంగీతాన్ని ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా చూస్తారు. ఇలాంటి ఒక గొప్ప స్వరకర్త ఈరోజు మరణించారు.. గత కొన్ని వారాలుగా ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు.. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఆయన స్వగ్రామం అయిన తంజావూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.

28 యేళ్ళకే మరణం..

28 ఏళ్లకే మరణించడం అటు సినీ పరిశ్రమ ఇటు కుటుంబ సభ్యులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇంత చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలతో మరణించడం ఏమిటి అంటూ ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ పరిశ్రమలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.. సాధారణంగా గుండెపోటు వచ్చింది అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇలాంటి కారణాలతోనే సెలబ్రిటీలు చనిపోతున్నారని సరిపెట్టుకునేవారు.. కానీ ఇంత చిన్న వయసులోనే ఆయన ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అనే విషయం అభిమానులను కలచి వేస్తోంది. ఏది ఏమైనా ప్రవీణ్ కుమార్ ఇలా అనారోగ్య సమస్యలతో ఇంత చిన్న వయసులోనే మరణించడం అత్యంత బాధాకరమని చెప్పవచ్చు.

- Advertisement -

ప్రవీణ్ కుమార్ సినిమాలు..

ప్రవీణ్ మొత్తం మీద రాకథాన్, మేడక్ 2, కక్కన్, బంపర్, రాయర్ పరంపరై వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించారు.. మొత్తం మీద ఇలాంటి యంగ్ డైరెక్టర్లు సినీ ఇండస్ట్రీలో ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగాల్సి ఉంది.. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాల్సి ఉంది.. కానీ ఇంత చిన్న వయసులోనే వీరి మరణం మరింత దిగ్బ్రాంతికి గురిచేస్తుందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు