Spirit: ప్రభాస్ ఫ్యాన్స్ కి గ్యారెంటీ ఇచ్చేసాడు.. ఇంతకన్నా ఏం కావాలి..!

టాలీవుడ్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ సినిమాల్లో “స్పిరిట్” కూడా ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. అసలు ఈ కాంబో సెట్ అవుతుంది అని కూడా ఎవ్వరూ ఊహించి ఉండరు. అలాంటిది వీళ్లిద్దరి కాంబో లో మూవీ అనౌన్స్ మెంట్ చేసినప్పుడే టాలీవుడ్ లో ఓ రేంజ్ లో ట్రెండ్ అయింది. ఇక ఫ్యాన్స్ అయితే ప్రభాస్ ని వైలెంట్ రోల్ లో ఎప్పుడూ చూసి ఉండరు. ఇక సందీప్ రెడ్డి లాంటి డైరెక్టర్ తో డార్లింగ్ సినిమా ఉంటుందంటే ఒక మాస్ కల్ట్ క్లాసిక్ సినిమా రాబోతుందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అది ఎంతలా అంటే ఆ మూవీ హిట్ అయినా ప్లాప్ అయినా ప్రభాస్ ని కొత్త గా వంగ మార్క్ ఓ చూపిస్తే చాలు అనుకున్నారు.

ఇక సందీప్ రెడ్డి వంగ అనిమల్ మూవీ ప్రమోషన్, ప్రభాస్ సలార్ మూవీ ప్రమోషన్ లలో ఇన్నాళ్లు బిజీగా గడిపేశారు. ఇక సలార్, అనిమల్ రిలీజ్ అవడం హిట్ అవడం కూడా జరిగిపోయాయి. ఇప్పుడు ఇద్దరూ ఫ్రీ అయ్యారు కాబట్టి, స్పిరిట్ సినిమా మొదలవ్వొచ్చేమోనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అందరూ అనుకుంటున్నట్టే ఈ సినిమా ఫిబ్రవరిలో మొదలయ్యే ఛాన్స్ ఉందని సందీప్ రెడ్డి వంగ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది.

ఇక ఆ ఇంటర్వ్యూ లో సందీప్ మాట్లాడుతూ ప్రభాస్ ని ఇంతవరకు ఫ్యాన్స్ ఎప్పుడూ చూడలేని విధంగా, చాలా కొత్తగా చూపిస్తాను.. ఇన్తక్త్ వరకు ప్రభాస్ అలాంటి పాత్ర చేయలేదు. ఫ్యాన్స్ కి మాత్రం ఓ ‘ఐ ఫీస్ట్’ ట్రీట్ ఇస్తా అని సందీప్ అన్నాడు. ఇక ఈ వార్తను ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ మాత్రం మారుతీ తో చేస్తున్న రాజా డీలక్స్ సినిమాను తొందరగా పూర్తి చేసి పూర్తిగా సందీప్ రెడ్డి సినిమాకు డేట్లు కేటాయించాలని చూస్తున్నాడట.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు