Janhvi kapoor : పొట్టి డ్రెస్సుల్లో రచ్చ చేస్తూ హీటెక్కిస్తోంది..

Janhvi kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా, నిర్మాత బోణి కపూర్ కూతురిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ధఢక్ సినిమాతో గ్రాండ్ గా హీరోయిన్ గా పరిచయమయింది. ఇక ఫస్ట్ సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది జాన్వీ. అంతే కాదు గుంజన్ సక్సేనా వంటి సినిమాలతో హీరోయిన్ గానే కాకుండా నటిగానూ ప్రశంసలు అందుకుంది. కానీ ఇప్పటివరకు తన కెరీర్ లో సరైన సక్సెస్ పడలేదని చెప్పాలి. ఓ మోస్తరు విజయాలు తప్ప, బ్లాక్ బస్టర్ రేంజ్ లో హిట్టు పడలేదు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో కూడా సినిమా అవకాశాలను అందుకొని సౌత్ ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యారు. అలా అనడం కంటే సౌత్ ని నమ్మకుని స్టార్ హీరోయిన్ అవుదామని డిసైడ్ అయిందని చెప్పొచ్చు. ఇక జాన్వీ కపూర్ ఇప్పటికే రెండు తెలుగు పాన్ ఇండియా సినిమాలలో హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం.

పాన్ ఇండియా ప్రాజెక్టులతో..

ఇక సౌత్ లో వరుస ప్రాజెక్టులు లైన్లో పెట్టిన జాన్వీ కపూర్ ఒక్క తెలుగులోనే రెండు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తుంది. ఈ రెండు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. అందులో ఒకటి.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న “దేవర” కాగా, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నటిస్తున్న సినిమా RC16. ఇక ఈ సినిమా మే ఎండింగ్ లో మొదలుకానుంది. ఇక నిజానికి జాన్వీ కపూర్ లక్ కొద్దీ ఈ సినిమాల్లో ఛాన్స్ లభించిందని చెప్పాలి. ఇక ఈ రెండు సినిమాలు చేస్తుండగాని సౌత్ లో మరిన్ని ఆఫర్లు అందుకుంటుంది జాన్వీ కపూర్. అయితే జాన్వీ కపూర్ కి సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా విజయాలు లేకపోయినా ఇన్ని ఆఫర్లు వస్తున్నాయంటే, బోనికపూర్ శ్రీదేవి కూతురిగా, ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ కూడా అని చెప్పొచ్చు. అయితే సినిమా సక్సెస్ కూడా ముందు ముందు కావాల్సి ఉంటుంది.

పొట్టి పొట్టి డ్రెస్సులతో రచ్చ..

ఇక జాన్వీ కపూర్ లేటెస్ట్ గా చేసిన పోటోషూట్స్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ గా పొట్టి డ్రెస్సులో చెక్స్ మోడల్ పొట్టి గౌను ఓ ఓ హౌస్ సెట్ లో ఆ ఫోటోషూట్ చేసింది. అయితే ఇంతకు ముందు ఎక్కువగా చీరల్లో ఫోటోషూట్లు చేసే జాన్వీ(Janhvi kapoor), ఇప్పుడు ఎలాంటి డ్రెస్సుల్లో అయినా పోజులివ్వడానికి రెడీ అవుతుంది. ఇక ఇలాంటి ఫోటోషూట్లతోనే జాన్వీ కపూర్ ఇంస్టాగ్రామ్ లో భారీ ఫాలోయింగ్ ని సంపాదించుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం జాన్వీ కపూర్ కి ఇంస్టాగ్రామ్ లో 24 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. పెద్దగా సక్సెస్ రేట్ లేకపోయినా ఈ రేంజ్ ఫాలోవర్లు ఉన్నారంటే మామూలు విషయం కాదు. ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ లో ఎక్కువగా జాన్వీ కపూర్ అందాలు ఆరబోస్తోంది. జాన్వీ కపూర్ గ్లామర్ విషయంలో ప్రస్తుతంఎక్కడా తగ్గడం లేదని చెప్పాలి. ఇక ప్రస్తుతం దేవర షూట్ లో బిజీ గా ఉన్న జాన్వీ త్వరలో చరణ్ సినిమా షూటింగ్ లోనూ బిజీ అవనుంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు