King Nagarjuna Kubera First Look : వర్షంలో నోట్ల కట్టలతో అసలైన కుబేరుడు..

King Nagarjuna Kubera First Look : టాలీవుడ్ లో అభిరుచి గల దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఎంతో టాలెంట్ ఉన్న ఈ దర్శకుడు తాను చాలా చాలా సింపుల్ గా సినిమాలు తీస్తూ పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు కొడుతుంటాడు. స్టార్ హీరోలు లేకపోయినా శేఖర్ కమ్ముల సినిమా అంటే ఆడియన్స్ ఎగబడిపోతారు. ఇక ఫస్ట్ టైం శేఖర్ కమ్ముల ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమా చేస్తున్నాడు. ఇక శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ కుబేర. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. ఇక ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ తోనే అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. “కుబేర” అని ఊహించని టైటిల్ పెట్టి, ధనుష్ ని బిచ్చగాడి గెటప్ లో శేఖర్ కమ్ముల చూపించారు. ఇక ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ లో బ్యాక్ లో శివుడి రిఫరెన్స్ చూపించడం అద్భుతం అని చెప్పాలి. దాంతోనే శేఖర్ కమ్ముల వైవిధ్యంగా, ఒక బలమైన కథతో ఏదో చేయబోతున్నారు అని అర్థం అయింది. ఇక సినిమాలో కింగ్ నాగార్జున ప్రత్యేకమైన కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నాగార్జున ఫస్ట్ లుక్ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

నోట్ల కట్టలతో అసలైన కుబేరుడ..

ఇక కుబేర సినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఆ పాత్ర కి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కాసేపటికిందే రిలీజ్ చేయటం జరిగింది. ఇక ఆ టీజర్ చాలా ఇంటెన్స్ గా, స్టైలిష్ గా, డీసెంట్ గా ఉండి ఆకట్టుకుంటుంది. శేఖర్ కమ్ముల మార్క్ అక్కడ కనిపిస్తుంది. ఇక టీజర్ లో నాగార్జున బ్లూ షర్ట్ ధరించి, కళ్ళజోడు పెట్టుకుని వర్షంలో గొడుగుతో నిల్చుని కూల్ లుక్ లో కనిపిస్తున్నాడు. బ్యాక్ సైడ్ నోట్ల కట్టలు కనిపిస్తుంటాయి. చూస్తుంటే నాగార్జున రిచ్ గా అసలైన కుబేరుడిగా కనిపిస్తున్నారు. ఇక ఇందులో వర్షం పడుతుండగా గొడుగు పట్టుకుని ఉన్న నాగ్ డబ్బు కట్టలు ఉండి, ఓపెన్ గా ఉన్న ఓ భారీ కంటైనర్ దగ్గర నిల్చుని ఉన్నారు. ఇక ఆ కంటైనర్ నుంచి వెనక్కి తిరిగి వస్తుండగా కింద 500 నోటు వర్షంలో తడిచి పాడైపోయి ఉంటుంది. దీనితో నాగ్ తన జేబు లో నుంచి ఒక 500 నోటు తీసి ఆ కంటైనర్ లో కలిపేస్తాడు. దీంతో నాగ్ క్యారెక్టరైజేషన్ గురించి డైరెక్టర్ ఎదో చెప్పాలనుకున్నాడని తెలుస్తుంది.

- Advertisement -

బీజీఎమ్ తో స్పెషల్ అట్రాక్షన్..

ఇక రిలీజ్ చేసిన టీజర్ లో కింగ్ నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ ఒక ఎత్తయితే, నాగార్జున (King Nagarjuna Kubera First Look) లుక్ కి తగ్గట్టు సినిమా టీజర్ కి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బిజియం మరో ఎత్తు. నాగార్జున కూల్ లుక్స్ కి ఇంటెన్సిటీ పెంచేలా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఉంది. మొత్తంగా నాగార్జున టీజర్ తో కుబేర చిత్రంపై శేఖర్ కమ్ముల ఆడియన్స్ కి కొత్త ఫజిల్ వదిలారు. ధనుష్ ఏమో బిచ్చగాడి గెటప్ లో కనిపిస్తున్నాడు. నాగార్జున ఏమో నోట్ల కట్టలతో ఉన్నాడు. అసలు వీరిద్దరి మధ్య కనెక్షన్ ఏంటి ? ఎవరు అసలైన కుబేరుడు ? లాంటి ప్రశ్నలు తలెతున్నాయి. ఇక ఈ సినిమా నుండి రాబోయే ధనుష్ టీజర్ పై మరింత ఆసక్తి నెలకొని ఉంది. మరి శేఖర్ కమ్ముల ఆ టీజర్ తో ఎలాంటి అంచనాలని క్రియేట్ చేస్తాడో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు