Friday OTT Releases: ఈ శుక్రవారం ఓటిటిలోకి రాబోతున్న సినిమాల్లో ఈ 4 డోంట్ మిస్

Friday OTT Releases : ప్రతి వారం వివిధ జానర్లలో ఉండే కొత్త సినిమాలు ఓటీటీలోకి అడుగు పెడుతూనే ఉంటాయి. కొత్త కొత్త కంటెంట్ తో దిగ్గజ ఓటీటీ సంస్థలన్నీ తమ ఆడియన్స్ ను అలరిస్తూ ఉంటాయి. మే ఫస్ట్ వీక్ కూడా కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటిటిలో స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నాయి. అయితే ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలోకి వస్తూ ఉంటాయి. దీని వల్ల అసలు ఏం చూడాలి అనే కన్ఫ్యూజన్ నెలకొంటుంది ప్రేక్షకుల్లో. అలా కన్ఫ్యూజ్ అయ్యే వారి కోసమే మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్ట్ ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ వారం రిలీజ్ కాబోతున్న కొత్త సినిమాల్లో నాలుగు సినిమాలను మాత్రం పొరపాటున కూడా మిస్ కాకుండా చూసేయండి.

1. మంజుమ్మెల్ బాయ్స్

మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ మే 5 నుంచి డిస్నీ ప్లస్ హార్ట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రెడీగా ఉంది. ఈ మూవీ ఒకేసారి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 22న థియేటర్లలోకి వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ మూవీ ఏకంగా 200 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటిన తొలి మలయాళ సినిమాగా హిస్టరీని క్రియేట్ చేసింది. తెలుగులో కూడా ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది.

2. సైతాన్

మోస్ట్ అవైటెడ్ హారర్ మూవీ సైతాన్. మే 3న అర్ధరాత్రి నుంచి ఈ మూవీ ఓటీటీ లోకి రాబోతుందని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. సైతాన్ మూవీకి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించగా, జియో స్టూడియోస్, దేవగన్ ఫిలింస్, పనోరమా స్టూడియోస్ పై సంయుక్తంగా నిర్మించారు. అమిత్ త్రివేది సంగీతం అందించగా, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, తమిళ స్టార్ మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రలో పోషించారు. మార్చి 8న థియేటర్లలోకి వచ్చిన ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ కూడా 200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

- Advertisement -

3. సిద్ధార్థ్ రాయ్

అర్జున్ రెడ్డికి కాపీ అనే విమర్శలను ఎదుర్కొన్న సిద్ధార్థ రాయ్ మూవీ ఫిబ్రవరి 23న థియేటర్లలోకి వచ్చింది. అక్కడ మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ రెండున్నర నెలల తర్వాత ఓటిటిలోకి అడుగు పెట్టబోతోంది. ఈ రొమాంటిక్ డ్రామా మే 3 నుంచి ఆహలో స్ట్రీమింగ్ కానుంది.

4. హీరామండి

పాపులర్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన కాస్ట్లీయస్ట్ సిరీస్ హిరామండి. మే 1 నుంచే ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్క్రీనింగ్ అవుతుంది. సంజయ్ లీలా బన్సాలి గ్రాండ్ నెస్ ను ఇష్టపడేవాళ్లు కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడాల్సిందే. ఈ సిరీస్ 1940ల కాలం నాటి లాహోర్ లోని హీరామండీలో ఉన్న వేశ్యల జీవితం చుట్టూ తిరుగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు