PushpaTheRule : దెబ్బేసిన పుష్ప రాజ్.. మహేష్ రికార్డ్స్ కంటిన్యూ..

PushpaTheRule : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టులలో పుష్ప ది రూల్ ఒకటి. ఈ సినిమాకోసం అభిమానులతో పాటు, కామన్ ఆడియన్స్ కూడా ఎంతో వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా నార్త్ లో అయితే బాలీవుడ్ సినిమాలని పక్కనబెట్టి ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానులు థియేటర్ల కలెక్షన్ల రికార్డుల కోసం ఎలా ఆరాటపడతారో, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆయా సినిమాల రికార్డుల కోసం అంతే తహతహలాడతారు. ముఖ్యంగా యూట్యూబ్ లో టాప్ స్టార్స్ నటించిన సినిమాల టీజర్ లు, గాని ట్రైలర్ లు గాని, లేక మరే సాంగ్స్ అయినా వస్తే చాలు వాటి రికార్డులతో సోషల్ మీడియా మొత్తం హడావుడిగా ఉంటుంది. ఒక టీజర్ రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్ గంటల ముందు నుండి సోషల్ మీడియాలో కాచుకు కూర్చుంటారు. అలాగే తాజాగా యూట్యూబ్ లో సాంగ్స్ రికార్డు లెక్కలు కూడా బ్రేక్ అవుతూ ఉంటాయి. తాజాగా పుష్ప ఫస్ట్ లిరికల్ సాంగ్ ని నిన్న రిలీజ్ చేయడం జరిగింది.

పాటకి సాలిడ్ రెస్పాన్స్ కానీ.. ?

తాజాగా పుష్ప ది రూల్ టైటిల్ (PushpaTheRule ) సాంగ్ ని రిలీజ్ చేయగా సోషల్ ఇండియాలో సాలిడ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. ఇక ఈ సినిమా గురించి అన్ని భాషల్లోనూ ఎంతగానో వెయిట్ చేస్తూ ఉండగా, హిందీ ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారని తెలిసిందే. నిజం చెప్పాలంటే పుష్ప పార్ట్ వన్ తెలుగు కంటే ఎక్కువగా హిందీలోనే ఆడిందని చెప్పొచ్చు. ఇక తాజాగా రిలీజ్ అయిన పుష్ప ది రూల్ టైటిల్ సాంగ్ సోషల్ మీడియా లో మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తెలుగులో కంటే, హిందీ వెర్షన్ కే అద్భుతమైన స్పందన వస్తుందని చెప్పాలి. ఓవరాల్ గా తెలుగును మించి హిందీలో రెస్పాన్స్ వస్తుందని వస్తున్న వ్యూస్ ని బట్టి చెప్పొచ్చు. ఇక తాజాగా పుష్ప 2 టైటిల్ సాంగ్ 24 గంటలు పూర్తయిపోగా, ఒక్కరోజు సాంగ్ రికార్డులలో పుష్ప దెబ్బేసాడని చెప్పాలి.

దెబ్బేసిన పుష్పరాజ్.. మహేష్ రికార్డు కంటిన్యూ..

పుష్ప ది రూల్ నుండి తాజాగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేయగా 24 గంటల రికార్డు లో సెన్సషనల్ రెస్పాన్స్ అందుకుని కొత్త రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ సౌత్ పరంగా కాకపోయినా, తెలుగుపరంగా కూడా ఏమాత్రం రికార్డు సృష్టించలేకపోయింది ఈ పాట. రెస్పాన్స్ వరకూ బాగానే ఉన్నా, ఆడియన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసారని తెలుస్తూనే ఉంది. ఇక 24 గంటల్లో పుష్ప ది రూల్ తెలుగు వెర్షన్ 10.4 మిలియన్ల వ్యూస్ ని 565k లైక్స్ ని సాధించిందని చెప్పొచ్చు. ఓవరాల్ అన్ని భాషల్లో కలిపి 26 మిలియన్ల వ్యూస్, 1.27 మిలియన్ల లైక్స్ సాధించింది. ఇక తెలుగు వెర్షన్ పరంగా మహేష్ గుంటూరు కారం దమ్ మసాల సాంగ్ 17.5 మిలియన్ల వ్యూస్ తో టాప్ లో ఉండగా, సర్కారు వారి పాట కళావతి సాంగ్ 806k లైక్స్ తో టాప్ లో ఉంది. ఓవరాల్ గా పుష్ప సాంగ్ కి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదని చెప్పాలి.

- Advertisement -

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు