Pushpa2 Song : నార్త్ లో పుష్ప గాడి క్రేజ్ కి నిదర్శనం.. తెలుగు కంటే హిందీకే ఎక్కువ..

Pushpa2 Song : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టులలో పుష్ప ది రూల్ ఒకటి. ఈ సినిమాకోసం అభిమానులతో పాటు, కామన్ ఆడియన్స్ కూడా ఎంతో వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా నార్త్ లో అయితే అక్కడి సినిమాలని పక్కనబెట్టి ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానులు థియేటర్ల కలెక్షన్ల రికార్డుల కోసం ఎలా ఆరాటపడతారో, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆయా సినిమాల రికార్డుల కోసం అంతే తహతహలాడతారు. ముఖ్యంగా యూట్యూబ్ లో టాప్ స్టార్స్ నటించిన సినిమాల టీజర్ లు, గాని ట్రైలర్ లు గాని, లేక మరే సాంగ్స్ అయినా వస్తే చాలు వాటి రికార్డులతో సోషల్ మీడియా మొత్తం హడావుడిగా ఉంటుంది. ఒక టీజర్ రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్ గంటల ముందు నుండి సోషల్ మీడియాలో కాచుకు కూర్చుంటారు. ఇక టాలీవుడ్ స్టార్స్ రీసెంట్ టైంలో పాన్ ఇండియా మూవీస్ చేస్తూ తమ మార్కెట్ ను పెంచుకుంటూ ఉండగా, పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, అదే రేంజ్ లో టీజర్, సాంగ్స్ తో ప్రమోట్ చేస్తున్నారు. అలాగే పుష్ప ఫస్ట్ లిరికల్ సాంగ్ ని కూడా తాజాగా యూట్యూబ్ లో రిలీజ్ చేసారు మేకర్స్.

తెలుగుని మించిన రెస్పాన్స్ నార్త్ లో..

క తాజాగా పుష్ప ది రూల్ టైటిల్ (Pushpa2 Song) సాంగ్ ని రిలీజ్ చేయగా సోషల్ ఇండియాలో సాలిడ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి అన్ని భాషల్లోనూ ఎంతగానో వెయిట్ చేస్తూ ఉండగా, హిందీ ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారని తెలిసిందే. నిజం చెప్పాలంటే పుష్ప పార్ట్ వన్ తెలుగు కంటే ఎక్కువగా హిందీలోనే ఆడిందని చెప్పొచ్చు. ఇక తాజాగా రిలీజ్ అయిన పుష్ప ది రూల్ టైటిల్ సాంగ్ సోషల్ మీడియా లో మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తెలుగులో కంటే, హిందీ వెర్షన్ కే అద్భుతమైన స్పందన వస్తుందని చెప్పాలి. రిలీజ్ అయిన కాసేపటికే తెలుగు కంటే హిందీ వెర్షన్ కే లైక్స్, పరంగానూ, వ్యూస్ పరంగానూ ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు తెలుగులో 6 మిలియన్ల వ్యూస్ రాగా, హిందీ వెర్షన్ కి 8 మిలియన్ల కి పైగా వ్యూస్ రావడం విశేషం. ఇక లైక్స్ పరంగా కూడా తెలుగు వెర్షన్ కి 448k లైక్స్ రాగా, హిందీ వెర్షన్ కి 457k లైక్స్ రావడం జరిగింది. దీన్ని బట్టి పుష్ప2 హైప్ నార్త్ లో ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

హిందీలో అల్ టైం రికార్డ్ టార్గెట్..

ఇక పుష్ప ది రూల్ సినిమాతో మేకర్స్ కూడా హిందీ వెర్షన్ లో అల్ టైం రికార్డులు కొల్లగొట్టాలని చూస్తున్నారు. పైగా పుష్ప కి పోటీగా వస్తున్న పలు సినిమాలు కూడా రిలీజ్ డేట్ ని క్యాన్సిల్ చేసుకుంటున్నాయి. ఇక పుష్ప ది రూల్ సౌత్ నుండి ఒక్క హిందీ వెర్షన్ కే 500 కోట్ల టార్గెట్ తో రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్ తో హిందీలో ఏ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ అయిందో తెలిసిందే. ఇక రానున్న అప్డేట్స్ తో నార్త్ కి వెళ్లి స్వయంగా చిత్ర యూనిట్ ప్రమోట్ చేయనున్నారు. ఇక ఈ సినిమాతో పుష్ప ఓవరాల్ గా 1000 కోట్ల టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్, రష్మిక మందన్న కి చెందిన ఫస్ట్ లుక్స్ రిలీజ్ కాగా, త్వరలో ఫహద్ ఫాజిల్ యొక్క భన్వర్ సింగ్ షెకావత్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు