Director’s Day: డైరెక్టర్స్ డే ఈవెంట్ పోస్టుపోన్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కు మే 4వ తారీఖు అనేది ఒక ప్రత్యేకమైన దినమని చెప్పొచ్చు. అదే రోజును డైరెక్టర్స్ డే గా ప్రకటించారు కూడా. దీనికి కారణం అదే రోజున దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మించడం అని చెప్పొచ్చు. దాసరి నారాయణ రావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మాటల్లో చెప్పలేనివి అని చెప్పొచ్చు. ఇప్పటికీ ఆయన లేని లోటు కనిపిస్తూనే ఉంటుంది.

తెలుగు సినిమా పరిశ్రమకు పెద్దదిక్కు ఎవరు అని అంటే అప్పట్లో టక్కును గుర్తుచ్చే పేరు ఆయనదే. ఇప్పటికీ కూడా దాసరి నారాయణరావు గారు లేకపోవడం పెద్దదిక్కుని కోల్పోయమంటూ చాలామంది అంటూ ఉంటారు. అయితే మే 4వ తారీఖున పెద్ద ఎత్తున దర్శకుల రోజు చేయాలని ఒక ఈవెంట్ ను ప్లాన్ చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీ. అయితే చాలామంది దర్శకులు కూడా ఒక యూనిట్ గా కలిసి చాలామంది దర్శకులను కలిశారు. అందరు దర్శకులును ఈ ఈవెంట్ కి హాజరు అవ్వాలని ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారు దర్శకుల సంఘం.

ఇకపోతే ఈవెంట్ ఇప్పుడు పోస్ట్ పోన్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈవెంట్ కి సంబంధించిన డేట్ ను అధికారకంగా ప్రకటించనుంది ఆ సంఘం. దాసరి గారి జయంతి సందర్భంగా ఈవెంట్ ను చేయనున్నట్లు తెలిపారు. ఇకపోతే దాసరి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
డా. దాసరి నారాయణరావు ( మే 4, 1947 – మే 30, 2017) సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత , రాజకీయనాయకుడు పలు సేవలు అందించారు. అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడుగా గిన్నిస్‌ బుక్ ఎక్కారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా సాహిత్య రచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం , కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.

- Advertisement -

దాసరి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, , మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా ఉండేవి. దాసరి తీసిన బొబ్బిలి పులి , సర్దార్ పాపారాయుడు సినిమాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో కీలక పాత్ర వహించాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు