HBD Actress Devika: భర్తని నమ్మి సర్వం కోల్పోయిన హీరోయిన్..కట్ చేస్తే..!

HBD Actress Devika: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది హీరోయిన్లు ఒకానొక సమయంలో ఉన్నత స్థానానికి చేరుకొని.. ఆ తర్వాత కట్టుకున్న భర్త చేతిలోనే దారుణంగా మోసపోతూ వుంటారు. అలాంటి వారిలో సావిత్రి తర్వాత ప్రధమంగా వినిపించే పేరు దేవిక.. దేవిక అంటే ఆనాటి శాంతి నివాసం లాంటి చిత్రాలు గుర్తుకువస్తాయి. ఎన్టీఆర్ తో ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాలలో నటించి దేవిక.. అప్పట్లో సావిత్రి , అంజలి, బి.సరోజా దేవి , జమున, కృష్ణకుమారి తో సమానంగా కథానాయికగా పేరు సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ తో చాలా సినిమాలలో నటించి మెప్పించింది ఇకపోతే దేవిక బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.. ఈమె సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య మనవరాలు.. దీంతో సినిమాల్లో ఈజీ గానే ఎంట్రీ ఇవ్వగలిగారు.. కానీ ఏఎన్ఆర్ తో మాత్రం ఆమె ఒక్క సినిమాలో కూడా హీరోయిన్ గా నటించలేదు.

HBD Actress Devika: The heroine who trusted her husband and lost everything..if cut..!
HBD Actress Devika: The heroine who trusted her husband and lost everything..if cut..!

శాంతి నివాసం లాంటి చిత్రాల్లో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్ల లాగా మాత్రం కాదు. కారణం ఆమె ఏఎన్ఆర్ బంధువుగా చెబుతారు. దానికి తోడు కొన్ని ఈర్ష, అసూయలు కూడా ఏఎన్ఆర్ తో దేవిక జట్టు కట్టకుండా అడ్డుపడ్డట్టు చెబుతారు.. సావిత్రి ఏఎన్ఆర్ ల జంట అప్పట్లో గొప్పగా ఉండేది.. సావిత్రి కి ముందు అంజలి, ఏఎన్నార్ల జంట బాగా పండేది.. సావిత్రి తరువాత ఏఎన్ఆర్ తో అంజలి దేవి సినిమాలు తగ్గాయి.. వీటి ప్రకారం ఏఎన్ఆర్ తో దేవిక హీరోయిన్ గా చేస్తే తమ హిట్ పెయిర్ హోదా ఎక్కడ లాగేసుకుంటుందో అన్న భయం కొద్ది సావిత్రి పడనీయలేదని సమాచారం.. దీంతో సావిత్రి దేవికను ఏఎన్ఆర్ జోడీగా తీసుకోవడానికి అడ్డు పడేవారని తెలుస్తోంది. ఎన్టీఆర్ మాత్రం దేవిక ఆమె కుటుంబ నేపథ్యం దృష్టిలో పెట్టుకొని శ్రేయోభిలాషి గా భావించే వారని అంటారు.

ఈమె జీవితానికి అడ్డు సావిత్రి..

దేవిక ఇటు తెలుగులో ఎన్టీఆర్ తో ఎన్ని సినిమాలు చేసిందో అటు తమిళ్లో శివాజీ గణేషన్ తో అన్నే సినిమాల్లో యాక్ట్ చేశారు. దీంతో ఆమె తెలుగులో ఎంత పాపులర్ అయిందో తమిళ్లో కూడా అంతే ఫేమస్. దేవిక జీవితం ఎంతో సాఫీగానే సాగుతుండేది.. ఆమె మెంటాలిటీ కూడా సాదాసీదా గానే ఉండేది.. ఎవరిని పెద్దగా డబ్బు డిమాండ్ చేసేది కాదు.. ఇచ్చినంత తీసుకొని నటించే టైపు.. ఈమెకు వచ్చిన సినిమా అవకాశాలు కూడా అలాంటివే.. దీంతో ఫ్లెక్సిబుల్ గా ఉండేవారు ..అయితే ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద హార్డర్ ఆమె భర్త. ఆమె ఇద్దరు పెద్ద హీరోలతో హీరోయిన్గా చేసి.. అసిస్టెంట్ డైరెక్టర్ అయిన దేవదాసు అనే వ్యక్తిని పెళ్లాడారు.. అప్పటిలో దేవికనే అందరూ వారించారు అదేంటమ్మా అలాంటి వాడిని పెళ్లాడావ్.. ఏముందని అతన్ని పెళ్లి చేసుకున్నావు.. అని కూడా నిలదీశారు.. కానీ ఆమె తనకు లేని పంతాన్ని కొని తెచ్చుకొని అతన్ని దర్శకుడిగా తీర్చిదిద్దుతానని మొండి పట్టు పట్టారు. అప్పటివరకు తన సేకరించిన ఆస్తులు అన్నిటిని అమ్మేసి మరీ..అతడిని దర్శకుడిగా చేయాలని విఫల యత్నం చేశారు.. కానీ అన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయింది.. దీంతో దేవిక జీవితంలో పూర్తిగా దెబ్బ తినేశారు..

- Advertisement -

భర్త వల్లే సర్వం కోల్పోయిన దేవిక..

ఎన్టీఆర్ మంచి స్వింగ్ లో ఉన్న రోజుల్లో దేవిక హైదరాబాద్ షిఫ్ట్ అవమంటే కాలేదు.. ఆమెకు ఒక స్థలం తీయించి స్థిరం చేసే ప్రయత్నం చేస్తే సహకరించలేదు.. ఆ తర్వాత ఆడవాళ్లు అలిగితే తదితర చిత్రాలు చేశారు.. ఆమె ఎన్టీఆర్ తో కలిసి చేసిన చివరి సినిమా వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర ఈ చిత్రంలో తనని ఎవరు గుర్తుపట్టలేరు కూడా అంతగా మారిపోయారు.. దేవికకు దేవదాసు కు కనక అనే కూతురు ఉంది.. ఈమె గణనాథ కారన్ అనే తమిళ్ చిత్రంలో నటించగా.. అది ఏడాది పాటు ఆడి సూపర్ హిట్ తమిళ్ చిత్రంగా నిలిచింది.. తర్వాత కనక తమిళ్, మళయాల చిత్రలలో నటించగా.. అవి కూడా బాగానే ఆడాయి.. సుమారు 40 చిత్రాలలో యక్ట్ చేసిన కనక యుఎస్ లో ఇంజనీర్ గా పని చేసే వ్యక్తిని పెల్లాడి సినిమాలకు పూర్తిగా దూరమైపోయారు .. దేవిక మాత్రం మధ్యలోనే తన భర్తని వదిలేసి తర్వాతి కాలంలో ఒంటరిగానే మరణించారు.. నమ్మి కట్టుకున్న వాడి వల్ల ఆస్తులన్నీ కోల్పోయి కానరాని లోకాలకు వెళ్ళిపోయారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు