Pushpa Pushpa Song Copy : దేవి దొరికిపోయాడు… పుష్ప ఫస్ట్ సింగిల్ మక్కీకి మక్కి దింపేశాడు.

Pushpa Pushpa Song Copy : దేశమంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న పుష్ప 2: ది రూల్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. పక్కా మాస్ బీట్ తో ఫుల్ జోష్ తో ఉన్న ఈ పాటను మే 1న రిలీజ్ చేశారు మేకర్స్. ఇంకేముంది పాట బాగుందంటూ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అద్భుతం అంటూ ఊగిపోతున్నారు. కానీ ఆయన ఈ ఫస్ట్ సింగిల్ ను కాపీ కొట్టి తాజాగా మరోసారి దొరికిపోయాడు రాక్ స్టార్. దేవి ఈ పాటను ఎక్కడ కాపీ కొట్టాడో పట్టేశారు. ఇక పుష్ప పాటను, ఒరిజినల్ పాటను పక్కనే పెట్టి పోలిస్తే మక్కికి మక్కిగా దింపేశారు అనే విషయం క్లారిటీగా అర్థమవుతుంది. మరి దేవిశ్రీ ఈ పాటను ఏ పాట నుంచి కాపీ కొట్టాడు? అనే విషయంలోకి వెళ్తే…

దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మ్యూజిక్ విషయంలో ఆయనపై మరింత బాధ్యత ఒత్తిడి పెరుగుతాయి. పుష్ప మూవీలో ఆయన అందించిన సంగీతం దేశాన్ని ఊపేయగా, జాతీయ అవార్డు అందుకుని మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు రాక్ స్టార్. కానీ ఎప్పటిలాగే మళ్ళీ కాపీ క్యాట్ అనే కామెంట్స్ విన్పిస్తున్నాయి ఆయనపై. తాజాగా పుష్ప 2 నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ పై విమర్శలు వెలువెత్తుతున్నాయి.

Pushpa 2 song which got solid response in Hindi
Pushpa The Rule First Single

ఆయన ఆ పాటను ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పాట నుంచి కాపీ కొట్టడమే దానికి కారణం. మక్కికి మక్కీగా దించేసి అడ్డంగా దొరికిపోయాడు ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. అలియా భట్, రణదీప్ హుడా జంటగా నటించిన హైవే అనే మూవీలోని పటాకా గుడ్డి అనే పాట నుంచి దేవి పుష్ప పుష్ప పాటను కాపీ కొట్టడంతో ఆయనపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు నెటిజెన్లు. ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుండి మరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పాటను ఎలా కాపీ కొడతారు అంటూ ఫైర్ అవుతున్నారు.

- Advertisement -

దేవి శ్రీ ప్రసాద్ కాపీ కాంట్రవర్సిస్…

దేవిశ్రీ ప్రసాద్ ఇతరుల మ్యూజిక్ నే కాదు తన మ్యూజిక్ తానే కాపీ కొడతాడు అనే అపవాదు ఉండనే ఉంది. గతంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకు పౌర్ణమి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను ఇలాగే కాపీ కొట్టి దొరికిపోయాడనే ఓ వాదన కూడా వచ్చింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి రెండు సినిమాలకు ప్రభుదేవనే డైరెక్టర్ కాబటి… అనుమతితోనే పౌర్ణమిలో సాంగ్ వచ్చిందని అంటుంటారు. అలాగే తమిళ మూవీ పులి సినిమాలోని సొత్తవాలా అనే పాటకు ఎవడు సాంగ్ మ్యూజిక్ ను, శ్రీమంతుడు సినిమాకు ఇంద్ర సినిమాలోని బిజిఎంను కాపీ చేశాడని విమర్శలు వినిపించాయి. అలాగే మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాకు కూడా ఇలాంటి విమర్శలే వినిపించాయి. బ్లాక్ బస్టర్ మూవీ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోని ఓ పాట వెంకీ సినిమాలోని మరో పాటకు రీమేక్ లా అనిపించే విధంగా కంపోజ్ చేసి నెగెటివిటీని ఎదుర్కొన్నాడు.

అలాగే ఎవడు, తులసి, మిర్చి సినిమాలలో కూడా ఆయన అందించిన మ్యూజిక్ గమనిస్తే తేడా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా పుష్ప మూవీలో బ్లాక్ బస్టర్ ఐటమ్ సాంగ్ ఊ అంటావా పాటను వీడొక్కడే మూవీలోని హనీ హనీ పాట నుంచి, తాజాగా పుష్ప 2 లో కూడా అదే విధంగా రెహమాన్ సాంగ్ ను కాపీ చేశాడు దేవి. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎవరూ మ్యూజిక్ ను కావాలని కాపీ కొట్టరు అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు దేవిశ్రీ. కానీ కావాలని కాపీ కొట్టకపోయి ఉంటే మరీ ఇంత మక్కికి మక్కిగా ఎలా దింపుతారు అంటూ ప్రశ్న ఇస్తున్నారు నెటిజెన్లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు