Pooja Hegde New Movie : టిల్లుతో పూజా హెగ్డే రొమాన్స్… జోడీ సెట్ అవుతుందా?

Pooja Hegde New Movie : బుట్ట బొమ్మ పూజ హెగ్డే కు మళ్లీ సౌత్ నుంచి వరుస అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య నెక్స్ట్ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించబోతుందని రూమర్లు బయటకు వచ్చాయి. తాజాగా 100 కోట్ల క్లబ్ లో చేరిన టిల్లు స్క్వేర్ సీక్వెల్ లో బుట్ట బొమ్మ భాగం కాబోతుందని వార్త వినిపిస్తోంది. మరి ఈ క్రేజీ హీరోతో బుట్ట బొమ్మ రొమాన్స్ ఎంత వరకు వర్కవుట్ అవుతుంది అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజ హెగ్డే కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. ఆమె నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ కావడంతో అవకాశాలు కరువయ్యాయి.  రీసెంట్ గా హీరోయిన్ గా ఫిక్స్ అయ్యాక కూడా గుంటూరు కారం మూవీ నుంచి తప్పుకోక తప్పలేదు. ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి తన కుటుంబంతో టైం స్పెండ్ చేస్తుంది పూజా హెగ్డే. ఈ క్రమంలోనే తన బాయ్ ఫ్రెండ్ తో కెమెరాల కంటికి చిక్కి వార్తల్లో నిలిచింది. మరి ఆ వార్తల మహిమో ఏంటో తెలీదు గానీ ప్రస్తుతం టాలీవుడ్ నుంచి పూజా హెగ్డేకు పిలుపు వస్తోందనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ సరసన పూజా హెగ్డే నటించబోతుందని టాక్ నడుస్తోంది.

డీజే టిల్లు మూవీతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ ఆ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ మూవీతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు కూడా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టిల్లు స్క్వేర్ మూవీలో యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించి, హాట్ గ్లామర్ షోతో అదరగొట్టింది. మొదటి పార్ట్ లో రాధికగా హీరోయిన్ నేహా శెట్టి పిచ్చెక్కించే గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. సెకండ్ పార్ట్ టిల్లు స్క్వేర్ లో కూడా ఆమె గెస్ట్ రోల్ లో కనిపించి మెప్పించింది. ఈ నేపథ్యంలోనే టిల్లు స్క్వేర్ ఏకంగా 125 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సిద్ధూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా రికార్డును క్రియేట్ చేసింది.

- Advertisement -

ఇక థియేటర్లోనే టిల్లు స్క్వేర్ కు సీక్వెల్ గా టిల్లు క్యూబ్ రాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ ఈ మూవీ స్క్రిప్ట్ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డేను ఎంపిక చేశారు అనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మరి మీరిద్దరి జోడి ఎలా ఉంటుంది? పూజ ఈ మిడ్ రేంజ్ హీరోతో రొమాన్స్ చేయడానికి ఒప్పుకుంటుందా? అనేది తెలియాలంటే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వైట్ అండ్ సీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు