Bollywood Comedian: ఒక్కో ఎపిసోడ్ కి రూ.5 కోట్లు.. డిమాండ్ భారీగా వుందే..!

Bollywood Comedian..బాలీవుడ్ లో ఉండే సెలబ్రిటీలు సౌత్ సెలబ్రిటీలతో పోల్చుకుంటే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే సౌత్ లో భారీ పాపులారిటీ దక్కించుకున్న తర్వాత చాలామంది సెలబ్రిటీలు కూడా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు.. ముఖ్యంగా చిన్న సినిమాలైనా సరే కోట్లల్లో రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉంటారు.అలాగే చిన్న చిన్న షో లైనా.. బిగ్ బాస్ వంటి బడా షోలు అయినా సరే భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు సెలబ్రిటీలు. అలా హిందీలో మంచి ప్రజాదరణ పొందినటువంటి షోలలో గ్రేట్ ఇండియన్ కపిల్ షో కూడా ఒకటి.. ఇందుకు హోస్ట్ గా కపిల్ శర్మ వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఎన్నో సీజన్లను కూడా విజయవంతంగా ఈ షో పూర్తి చేసుకుంది.

Bollywood Comedian: Rs. 5 crore per episode.. The demand will be huge..!
Bollywood Comedian: Rs. 5 crore per episode.. The demand will be huge..!

ప్రమోషన్స్ కి కేరాఫ్ అడ్డా..

ఈ షోకి ఎంతోమంది సెలబ్రిటీలను తీసుకువచ్చి వారికి సంబంధించిన విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా సినిమా విడుదల సమయంలో ప్రమోషన్స్ కి బాగా ఈ షోని ఉపయోగిస్తూ ఉంటారు బాలీవుడ్ సెలబ్రిటీస్. అయితే ఈ షో రీచ్ కూడా చాలా అద్భుతంగా ఉండడంతో సినిమా ప్రమోషన్స్ కి బాగా ఉపయోగపడుతోంది.. దీనివల్లే ఈ షో కి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ కపిల్ షో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది..

కపిల్ షో లో అమీర్ ఖాన్..

ఇప్పటికే ఈ సీజన్ కి ఎంతోమంది సెలబ్రిటీలను సైతం తీసుకువచ్చారు. గడిచిన కొన్ని రోజుల క్రితం ఇండియాలోనే అత్యధికంగా క్రేజీ కలిగిన హీరోలలో ఒకరైన అమీర్ ఖాన్ ని కూడా ఇందులో తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఆయనకు సంబంధించి తెలియని విషయాలను కూడా తెలియజేసేలా చేసింది ఈ కపిల్ షో.. ముఖ్యంగా ఇందులో కపిల్ శర్మ టైమింగ్ కూడా హైలెట్గా ఉండడంతో ప్రేక్షకుల నుంచి బాగా రెస్పాన్స్ లభిస్తోంది.. తాజాగా కపిల్ శర్మ ఈ షో కి హోస్టుగా చేస్తున్నందుకు ఎంత తీసుకుంటారు అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

ఒక్కో ఎపిసోడ్ కి రూ.5 కోట్లు..

అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. కపిల్ శర్మ ఒక్కో ఎపిసోడ్ కి రూ.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈయన కామెడీ టైమింగ్ ఈ షో కి మంచి ప్లస్ అవ్వడం చేత ఈ మాత్రం రెమ్యూనరేషన్ ఇవ్వడంలో ఎలాంటి సందేహం లేదని కూడా పలువురు అభిమానులు తెలుపుతున్నారు. అయితే ఈ షోలో జనాలలో కూర్చొని ఎప్పుడూ నవ్వుతూ ఉండేటువంటి అర్చన సింగ్ కి మాత్రం ఒక్కో ఎపిసోడ్ కి 10 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు సమాచారం. ఇలా వీరిద్దరూ ఈ షో ద్వారా ఒక్కో ఎపిసోడ్కి భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు