Panchayat 3 OTT Release Date : సస్పెన్స్ కు తెర దించిన ప్రైమ్ వీడియో… పంచాయత్-3 అఫిషియల్ రిలీజ్ డేట్ అవుట్

Panchayat 3 OTT Release Date : మోస్ట్ అవైటింగ్ వెబ్ సిరీస్ పంచాయతీ సస్పెన్స్ వీడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఇ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ గురించి ఊరించి ఊరించి మొత్తానికి ఓటిటి రిలీజ్ డేట్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది అమెజాన్ ప్రైమ్. అనుకున్నట్టుగానే ఈ నెలలో రిలీజ్ కు సిద్ధమవుతోంది పంచాయతీ 3. మరి ఈ పెప్ సిరీస్ రిలీజ్ ఎప్పుడు అంటే?

పంచాయత్ సీజన్ 3 స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

పంచాయత్ సీజన్ 3 వెబ్ సిరీస్ కు ఫుల్ క్రేజ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవాలంటే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఐపీఎల్ 2024 సీజన్ అడ్డుగా ఉంది. అందుకే ఈ సీజన్ పూర్తయ్యాక పంచాయత్ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయాలి అని అమెజాన్ అనుకుంటున్నట్టుగా టాక్ నడుస్తోంది. మే 26న ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది కాబట్టి మే చివర్లో లేదా జూన్ మొదట్లో రిలీజ్ చేస్తారని బజ్ నడిచింది. దానికి  తగ్గట్టుగానే తాజాగా ప్రైమ్ వీడియో పంచాయత్ 3 వెబ్ సిరీస్ ను మే 28 నుంచి స్ట్రీమింగ్ చేయనునట్టు ప్రకటించింది.

టీజ్ చేసిన అమెజాన్..

పంచాయత్ వెబ్ సిరీస్ కు మంచి ప్రేక్షకుదరణ దక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సీజన్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడవ సీజన్ కోసం అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ విలేజ్ డ్రామాకు సంబంధించిన అప్డేట్ అని చెప్పి బుధవారం నాడు ఆడియన్స్ ను టీజ్ చేసింది ప్రైమ్ వీడియో. అందులో భాగంగా ఓ వీడియోను పోస్ట్ చేసి, ఓపెన్ చేయొద్దండి… లోపల పంచాయతీ సీజన్ 3 డేట్ ఉంది అనే పేపర్ రిఫ్రిజిరేటర్ పై అంటించి ఉన్నట్టుగా అందులో కనిపించింది. అయితే ఆ డోర్ ఓపెన్ చేయగానే లోపల అన్నీ సొరకాయలే కనిపించాయి. ట్రై చేశారుగా అంత సింపుల్ కాదు… స్టే ట్యూన్డ్” అంటూ అందరినీ బకరాలను చేసేసారు. అలా ఊరించి ఊరించి తాజాగా మే 28 నుంచి పంచాయత్ 3 రానుంది అని ప్రకటించారు.

- Advertisement -

సీజన్ సీజన్ కు రెండేళ్ళు గ్యాప్…

పంచాయత్ వెబ్ సిరీస్ లో జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రను పోషించగా, మూడో సీజన్ లో ఆయనతో పాటే రఘువీర్ యాదవ్, నీనా గుప్తా, సన్విక, పైజల్ మాలిక్, చందన్ రాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ కు దీపక్ మిశ్రా దర్శకత్వం వహించగా, ది వైరల్ ఫీవర్ పతాకంపై శ్రేయాన్స్, పాండే, విజయ్ కోషి, అర్నాబ్ కుమార్ నిర్మించారు. కాగా ఫస్ట్ సీజన్ 2020 ఏప్రిల్ 3న, సెకండ్ సీజన్ 2022 మే 20న రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అంటే 2024 మే 28న మూడవ సీజన్ రాబోతోంది. అంటే సీజన్ సీజన్ కు రెండేళ్ల గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు మేకర్స్. మరి పంచాయత్ సీజన్ 3 ఎలా ఉంటుందో చూడాలంటే మే 28 దాకా వైట్ అండ్ సీ. అప్పటిదాకా అందుబాటులో ఉన్న ఐపీఎల్ తో పాటు వెబ్ సిరీస్ లు, సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు