OTT Series : తమన్నాను ఇంత దారుణమైన పరిస్థితిలో ఎప్పుడూ చూసి ఉండరు… ఒక్కరాత్రిలో 9000 కోట్లు కట్టాల్సిందే

OTT Series : ప్రస్తుతం ఓటీటీకి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని స్టార్ హీరోలు హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ముఖ్యంగా థ్రిల్లింగ్, సస్పెన్స్ క్రైమ్, హారర్ వంటి జానర్ లో వచ్చే వెబ్ సిరీస్ ల వైపే అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ఈ ఛానల్ లో వచ్చే సినిమాలు అనుక్షణం ఉత్కంఠ భరితంగా ఉంటాయి. అయితే అందరి కంటే ముందే తమన్నా ఇలాంటి ఓ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. అ వెబ్ సిరీస్ కి పెద్దగా ప్రేక్షక ఆదరణ దక్కలేదు గాని తమన్నా నటనపై మాత్రం ప్రశంసల వర్షం కురిసింది. మరి యావరేజ్ టాక్ తెచ్చుకున్న తమన్నా వెబ్ సిరీస్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

తమన్నా ఫస్ట్ వెబ్ సిరీస్

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న వెబ్ సిరీస్ పేరు లెవెన్త్ అవర్. ఈ సిరీస్ కు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించగా, తమన్నా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సిరీస్ ద్వారానే తమన్నా డిజిటల్ ప్రపంచంలోకి ఫస్ట్ టైం అడుగు పెట్టింది. లెవెన్త్ అవర్ సిరీస్ తెలుగులో ఆహాలో అందుబాటులో ఉంది.

లెవెన్త్ అవర్ స్టోరీ విషయానికి వస్తే…

ఇదంతా ఒకే ఒక్క రాత్రిలో జరిగే కథగా తెరకెక్కించారు. ఇందులో తమన్నా పేరు అరత్రిక. ఆమె ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీకి చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. అయితే ఈ కంపెనీ ద్వారా దేశానికి క్లీన్ పవర్ అందించాలనే ఉద్దేశంతో లేటెస్ట్ టెక్నాలజీ తో ఒక సోర్స్ ని కనిపెడుతుంది. కానీ పెద్దలుగా చెప్పుకునే కొందరు ఈ ప్రాజెక్టు విషయంలో అరత్రికకు అడ్డుపడతారు. రాజకీయ కుట్ర వల్ల అరత్రిక కంపెనీ దివాలా తీసే పరిస్థితి నెలకొంటుంది. మరుసటి రోజే ఉదయం 8 గంటల లోపు ఆమె ఇంపీరియల్ బ్యాంకుకి 9000 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది.

- Advertisement -

తమన్నాకు అడ్డుగా ఇంతమంది..

ఈ నేపథ్యంలోనే అరత్రిక మాజీ భర్త, ఆమె కంపెనీ కాంపిటేటర్, ఇంపీరియల్ బ్యాంక్ ప్రెసిడెంట్, దుబాయ్ షేక్ ఆ ప్రాజెక్ట్ ని తమకి అమ్మేయమని ఒక్కొక్కరు ఒక్కో ప్రపోజల్ని ఆమె ముందు ఉంచుతారు. అయితే తాను ఎప్పటినుంచో కలలు కన్న ఈ ప్రాజెక్టును ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ తమన్నా సూర్యుడు ఉదయించే లోపే ఏదైనా మ్యాజిక్ జరిగితే బాగుండు అని కోరుకుంటుంది.

ఒక్క నైట్ లో 9000 కోట్లు కట్టాలి

మరి ఒక్క నైట్ లో ఆమె 9,000 కోట్లకు పైగా డబ్బులను బ్యాంక్ కి కట్టగలిగిందా? ఆమె ఈ ఒంటరి పోరాటంలో కాంప్రమైజ్ అయిందా? తన ప్రాజెక్ట్ ను కాపాడుకోవడం కోసం ఎలాంటి ఎత్తుగడలు వేసింది? చివరకు ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ను చూసి తీరాల్సిందే. ఈ గ్రిప్పింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని చూశాక వర్త్ వాచింగ్ సిరీస్ అని తప్పకుండా అనుకుంటారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు