Samantha: సమంతకు సీక్రెట్ బాయ్ ఫ్రెండ్… ఆ గిఫ్ట్ అతను ఇచ్చిందేనా?

Samantha : హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత సోషల్ మీడియాకు మాత్రం బ్రేక్ ఇవ్వలేదు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటోంది. రెండ్రోజుల క్రితం సామ్ బర్త్ డే జరగ్గా దానికి సంబంధించిన పిక్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సామ్ షేర్ చేసిన పిక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

స్పెషల్ గిఫ్ట్..

ఏప్రిల్ 28న తన పుట్టిన రోజును స్నేహితులతో కలిసి గ్రాండ్ గా  సెలబ్రేట్ చేసుకుంది సమంత. ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, పలువురు ప్రముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెలువత్తాయి. అయితే సమంత తన బర్త్ డేను ఈసారి విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా గ్రీస్ కు వెళ్లిన ఈ బ్యూటీ ఏథెన్స్ లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. ఏథెన్స్ లో తాను తిరిగిన కొత్త కొత్త ప్రాంతాలు, అక్కడ జరుపుకున్న బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత షేర్ చేసిన మరో పిక్ హాట్ టాపిక్ గా మారింది. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో సమంత ఓ పిక్ ను జూమ్ చేసి మరీ షేర్ చేసింది. అందులో సామ్ రోజ్ గోల్డ్ చైన్ ధరించి కనిపిస్తోంది. దానికి కన్ను గుర్తుతో ఉన్న ఒక చిన్న లాకెట్ కూడా ఉంది. ఇక ఆ ఫోటోను చూసిన నెటిజెన్లు ఈ ఫోటోను ఎవరిచ్చారు? నీ సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఫ్యాన్స్ మాత్రం బాయ్ ఫ్రెండ్ అయితేనే గిఫ్ట్ ఇవ్వాలా? అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఆ పిక్ తెగ వైరల్ అవుతుంది.

- Advertisement -

సమంత కొత్త సినిమా…

ఇక అనారోగ్యం కారణంగా దాదాపు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది సమంత. అయినప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మయాసైటిస్ నుంచి పూర్తిగా కోల్పోవడంతో వరుసగా సినిమాల చేసే ప్లాన్ లో ఉంది. ఇప్పటికే ఆమె నటించిన సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కు దర్శకత్వం వహించగా, వరుణ్ ధావన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఇక రీసెంట్ గా తన పుట్టిన రోజు సందర్భంగా మరో కొత్త మూవీని అనౌన్స్ చేసింది సమంత. మా ఇంటి బంగారం అనే టైటిల్ తో రాబోతున్న ఆ మూవీ టైటిల్ పోస్టర్ ను రివీల్ చేశారు. పోస్టర్ లో సమంత ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించింది. ఈ మూవీనీ ఆమె సొంత నిర్మాణ సంస్థ నిర్మిస్తుండడం మరో విశేషం. ఇక సామ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు కావడంతో, ఆమె నెక్స్ట్ మూవీ గురించి ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు