Heeramandi Web Series Review In Telugu : హీరామండి వెబ్ సిరీస్ రివ్యూ

Heeramandi Web Series Review In Telugu : బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం మూవీ లవర్స్ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన తీసే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాలన్నీ కళాఖండాలే. తాజాగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ హీరామండి ది డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ పీరియారిక్ డ్రామా ఓటిటీ ప్రియులను మెప్పించిందా? అనే విషయాన్ని తెలుసుకుందాం.

కథ…

స్వాతంత్రం రావడానికి ముందే పాకిస్తాన్ లోని లాహోర్లో హీరామండి అనే వేశ్యావాటిక ఉండేది. మల్లికా జాన్ (మనిషా కొయిరాలా) అక్కడి షాహీ మహల్ కు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ ఉంటుంది. వహీదా (సంజీద షేక్)  ఆమె సోదరిగా, బిబోజాన్ (అదితి రావు హైదరి), ఆలంజేబు (షర్మిన్ సెహగల్) ఇద్దరూ ఆమె కుమార్తెలుగా నటించారు. క్వాబాగ్ అనే మరో మహల్ కు ఫరిదాన్ (సోనాక్షి సిన్హా) పెద్దగా వ్యవహరిస్తూ ఉంటుంది. మల్లికా జాన్ అంటే ఆమెకు ద్వేషం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మల్లికా జాన్ తన చిన్న కూతురు వేశ్యగా మార్చాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆమె మాత్రం బాలోచి నవాబు తాజ్ దర్ ను ప్రేమిస్తుంది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఇరువైపుల పెద్దలకు అసలు నచ్చదు. ఈ క్రమంలోనే మల్లికాకు బుద్ధి చెప్పాలనుకున్న ఆమె సోదరి వహీదా ఫరీదాన్ తో కలిసిపోతుంది.

మరోవైపు లజ్జో (రిచా చద్దా) భగ్న ప్రేమికురాలిగా కనిపిస్తుంది. హీరామండిలో ఇలాంటి వ్యవహారాలు నడుస్తుంటే బిజోజాన్ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగే స్వాతంత్ర పోరాటంలో గూఢచారిగా ఉంటుంది. బ్రిటిష్ వారికి దగ్గరగా ఉండే మరో వ్యక్తితో పరిచయం పెంచుకొని, అతన్ని రహస్యాలు తెలుసుకోవడానికి వాడుకుంటుంది. బిజోజాన్ విషయం తెలుసుకున్న బ్రిటిషర్లు ఏం చేశారు? ఫరీదాన్ షాహి మహల్ కు హుజూర్ కావడానికి ఏం చేసింది? మల్లికా జాన్ పరిస్థితి ఏంటి? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

- Advertisement -

విశ్లేషణ…

చరిత్రలో ఎవ్వరికీ తెలియకుండా తెరమరుగైన అధ్యాయమే హిరామండి. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉండగా ఒక్కో ఎపిసోడ్ గంట దాకా ఉంటుంది. ఇక భారీ సెట్స్ ఉండడంతో సంజయ్ లీలా బన్సాలి మూవీకి తగ్గట్టుగా భారీగానే సాగుతుంది. విజువల్ ఫీస్ట్ గా ఉండే ఈ వెబ్ సిరీస్ లో మొదటి రెండు ఎపిసోడ్లను హీరమండీ లోని పాత్రలను పరిచయం చేయడానికి వాడుకున్నాడు డైరెక్టర్. మూడో ఎపిసోడ్ నుంచి వేశ్యల మధ్య జరిగే ఆధిపత్య పోరు, ప్రేమ వ్యవహారాలు, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగే తిరుగుబాటు వంటి అంశాలను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్లాడు డైరెక్టర్. హీరామండిలో అప్పట్లో జరిగిన ప్రతి విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు డైరెక్టర్.

కానీ ఇంత పెద్ద డైరెక్టర్ అయినప్పటికీ ఒకానొక దశలో స్టోరీ గాడి తప్పినట్టుగా అనిపిస్తుంది. చూసిన సెట్స్ నే మళ్లీ చూడడం విసుగ్గా అనిపిస్తుంది. కొన్ని ఎపిసోడ్స్ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి. ఆరో ఎపిసోడ్ తర్వాతే మళ్లీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. చివరి రెండు ఎపిసోడ్లు హైలెట్ గా ఉంటాయి. క్లైమాక్స్ బాగుంటుంది. కానీ పేర్లను గుర్తు పెట్టుకోవడం కష్టం. అయితే హీరోయిన్ల ముఖాలు తెలిసినవే కాబట్టి పెద్దగా కన్ఫ్యూజన్ ఉండదు.

ఇక సినిమాలో నటించిన అందరూ స్టార్స్ కాబట్టి వాళ్లంతా బాగానే నటించారు. మొత్తానికి పేరుకే వేశ్యా వాటిక నేపథ్యంలో సాగే కథ. కానీ ఎక్కడా అసభ్యకర సన్నివేశాలు లేకపోవడం విశేషం. బన్సాలి రేంజ్ విజువల్స్ కోసమైన ఓసారి కచ్చితంగా చూడొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు