House Of the Dragon Season 2 : హౌస్ ఆఫ్ ది డ్రాగన్ రిలీజ్ డేట్ తో పాటే ట్రైలర్ కూడా… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

House Of the Dragon Season 2 : గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రెండవ సీజన్ విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సిరీస్ టైలర్ తో పాటే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. మరి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది? అంటే..

ప్రీక్వెల్ లో రెండో సీజన్

గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ చరిత్రలోనే అత్యుత్తమ వెబ్ సిరీస్‌లలో ఒకటిగా రికార్డును క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్ 2019లో పూర్తి కాగా, ఆ తర్వాత ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ప్రీక్వెల్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చెప్పినట్టుగానే 2022 ఆగస్టు నెలలో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ప్రీక్వెల్ ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ మొదటి సీజన్ విడుదలైంది. తొలి సీజన్ లోనే అందరి దృష్టిని ఆకర్షించిన ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ రెండో సీజన్ రెండేళ్ల తర్వాత విడుదల కానుంది.

హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ట్రైలర్ విశేషాలు

తాజాగా ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 2 ట్రైలర్‌ను విడుదల చేయడంతో పాటు వెబ్ సిరీస్ విడుదల తేదీని కూడా ప్రకటించారు. ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ సీజన్ 1లో పాత్రల పరిచయం, వారి వ్యక్తిత్వాలను ఆవిష్కరించడం తదితర అంశాలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కానీ సీజన్ 2 లో నిజమైన యుద్ధం ప్రారంభమవుతుంది. కథ జరిగే ప్రాంతంలో అతిపెద్ద కుటుంబమైన టార్గారియన్ల మధ్య అధికారం కోసం యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో డ్రాగన్‌లు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.

- Advertisement -

‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో ప్రతి సీజన్‌లో ఒకటి లేదా రెండు ఇష్టమైన పాత్రలు చనిపోతాయి. హౌస్ ఆఫ్ ది డ్రాగన్‌లో కూడా అదే పద్ధతి కొనసాగుతోంది. ఇప్పుడు సీజన్ 2లో యుద్ధం వల్ల కథ వేరే మలుపు తిరిగింది. చాలా పాత్రలు అదృశ్యమయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ యుద్ధం కథ జరుగుతున్న ప్రాంతాన్ని పాలించే వివిధ కుటుంబాల మధ్య స్నేహం-శత్రుత్వానికి దారి తీసే అవకాశం ఉంది.

హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 రిలీజ్ డేట్

‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 2 జూన్ 17న HBO మ్యాక్స్‌లో విడుదల కానుంది. అదే రోజు జియో సినిమాలో కూడా రిలీజ్ కానుంది. ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ వెబ్ సిరీస్ జియో సినిమాలో ఇంగ్లీష్‌తో సహా ఆరు భాషల్లో విడుదల కానుంది. ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. జూన్ 17 నుండి ఎపిసోడ్‌లు ప్రతి సోమవారం ప్రసారం అవుతాయి. ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ తొలి సీజన్‌ భారీ విజయాన్ని అందుకుంది. అదేవిధంగా రెండో సీజన్‌కు కూడా భారీ ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2కు మూవీ లవర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు