Devara First Single: ఫియర్ సాంగ్ అఫీషియల్ అప్డేట్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. రచయితగా తన కెరియర్ స్టార్ట్ చేసి ఎన్నో అద్భుతమైన సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. రచయితగా ఉన్నప్పుడే మంచి గుర్తింపును సాధించుకున్నాడు. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మిర్చి అనే సినిమాకు దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు కొరటాల. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ సృష్టించింది. వాస్తవానికి ఆ సినిమా ఎప్పుడు మొదలైందో ఎప్పుడు ఫినిష్ అయిందో కూడా తెలియనంతగా అయిపోయింది. బాహుబలి ముందు వచ్చిన ఈ సినిమా, ప్రభాస్ కెరియర్ లో ఉన్న బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఇది కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది.

Devara First single Update
Devara First single Update

దర్శకుడిగా 2వ సినిమాతో 100 కోట్ల మార్క్

మొదటి సినిమాతోనే మాస్ కమర్షియల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు కొరటాల. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో శ్రీమంతుడు అనే సినిమాను చేసి బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాడు. శ్రీమంతుడు సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. అప్పటికే బాహుబలి సినిమా వేవ్ నడుస్తున్న తరుణంలో అంతటి హిట్ అవ్వటం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడితో కొరటాల శివకి తిరుగులేకుండా పోయింది. ఈ సినిమా తర్వాత చేసిన జనతా గ్యారేజ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. కేవలం బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాలు హిట్ అవ్వడమే కాకుండా సొసైటీ కి ఉపయోగపడే సందేశాన్ని కూడా తన సినిమాలతో ఇస్తాడు అని అనిపించుకున్నాడు కొరటాల.

- Advertisement -

ఆచార్యతో డిజాస్టర్

ఈ సినిమా తర్వాత మరోసారి మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాను చేసి కమర్షియల్ హిట్టు అందుకున్నాడు. మహేష్ బాబు ని సీఎం పాత్రలో చూపించి అద్భుతమైన హిట్టు కొట్టాడు. ఈ సినిమాలో కూడా మంచి మెసేజ్ ఉంటుంది. అయితే భరత్ అనే నేను సినిమా తర్వాత ఎవరికీ దక్కని అవకాశం కొరటాల శివకి దక్కింది. అదే మెగాస్టార్ చిరంజీవితో సినిమా. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలామంది కలలు కంటారు ఆ కలలు కలలుగానే మిగిలిపోతాయి. అని కొరటాల శివ కి ఆ కల నిజమైంది. కానీ ఆ సినిమా ఫలితం వలన అదొక పీడకలలా మిగిలిపోయింది. ఆచార్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి డిజాస్టర్ అయిందో మనకు తెలియనిది కాదు. సినిమా తర్వాత కొరటాల దాదాపు పాతాళానికి వెళ్ళిపోయాడు అని చెప్పొచ్చు.

ఆశలన్నీ దేవర పైనే

ఇకపోతే ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా దేవర. సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా హిట్ అవటం అనేది కొరటాల శివకు చాలా అవసరం. సక్సెస్ను పీక్ లో చూసిన కొరటాల శివ మళ్లీ డిజాస్టర్ చూశాడు. మొదటిసారి ఓటమి అంటే ఏంటో తెలుసుకున్నాడు. ఇప్పుడు ఎంతైనా ఈ సినిమాతో ప్రూవ్ చేసుకొని మరోసారి తన మార్కేంటో చూపించాలి. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కూడా మంచి అంచనాలను పెంచుతుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తారంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి ప్రస్తుతం అధికారిక ప్రకటన వచ్చింది. దీనిలో ఫియర్ అనే సాంగ్ను మే 19న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు అన్న విషయం మనకు తెలిసింది. ఈ సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు