Pawan Kalyan fans Vs Jagan Fans : పొలిమేర 2 బ్యూటీ చేసిన పనికి సోషల్ మీడియాలో పెద్ద వార్… ఎంటర్‌టైన్మెంట్ అంటూ కామెంట్..!

Pawan Kalyan fans Vs Jagan fans.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి ఎంతలా ఉందంటే పోటీ చేసే అభ్యర్థుల సంగతి పక్కన పెడితే.. వారి తరఫున ప్రచారాలు నిర్వహిస్తున్న వారి అభిమానులు మాత్రం తెగ రెచ్చిపోతున్నారనే చెప్పాలి.. ముఖ్యంగా గొడవలకు దిగుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో జగన్ వర్సెస్ పవన్ అంటూ అభిమానుల మధ్య గొడవలు కూడా తారాస్థాయికి చేరుకుంటున్నాయి.. ఇక ఇప్పుడు ఒక హీరోయిన్ చేసిన పనికి మళ్లీ సోషల్ మీడియాలో పెద్ద వార్ జరుగుతోంది .. మరి ఈ వార్ జరగడానికి ఆ బ్యూటీ ఏం చేసింది? ఇంతకు ఆమె ఎవరు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

పొలిటికల్ వార్ లో చిక్కుకున్న పొలిమేర 2 బ్యూటీ..

Pawan Kalyan fans Vs Jagan fans: There is a big war on social media for Polimera 2 beauty's work...entertainment..!
Pawan Kalyan fans Vs Jagan fans: There is a big war on social media for Polimera 2 beauty’s work…entertainment..!

ఆమె ఎవరో కాదు పొలిమేర , పొలిమేర 2 చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సాహితీ దాసరి.. పొలిమేర సినిమాలో గెటప్ శ్రీను భార్య రాములు పాత్రలో నటించిన ఈమె రెండో భాగంలో సత్యం రాజేష్ ను ప్రేమించిన అమ్మాయిగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలు చేస్తూ పెద్ద సినిమా లలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ అనూహ్యంగా ఒక పొలిటికల్ వివాదంలో ఇరుక్కుంది.. అసలు ఏం జరిగిందంటే.. సాధారణంగా ఈమె సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది.. ఇక అందులో భాగంగానే గుంటూరు కారం సినిమాలోని ఒక పాటకు డాన్స్ చేసి. ఆ పాటను అప్లోడ్ చేసింది. అయితే ఈమె డాన్స్ చేసిన టెర్రస్ మీద వెనుక వైయస్ జగన్ సిద్ధం పోస్టర్ కనిపిస్తోంది.. ఈ నేపథ్యంలోని ఈమె వైయస్ జగన్ ని ప్రమోట్ చేస్తోంది అంటూ అటు టిడిపి ఇటు జనసేనకు చెందిన కొంతమంది ఆమె వీడియోల మీద కామెంట్లు చేస్తూ వచ్చారు.. అంతేకాదు ఆమెపై నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఫోన్ కాల్స్ కూడా చేశారట..

పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ..

దీంతో అప్పట్లోనే ఈ విషయంపై ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చింది… ఒక ట్వీట్ వేస్తూ.. తాను ఏ పొలిటికల్ పార్టీకి మద్దతు పలకడం లేదు అంటూ చెప్పింది.తాను పవన్ కళ్యాణ్ అభిమానిని అని పేర్కొన్న ఈమె.. ఆయన నటన అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. అలాగే వైయస్ జగన్ గారి గురించి కూడా తనకు ఐడియా లేదని తెలిపింది.. తాను చేసిన పాటలకు సంబంధించి ఎటువంటి పొలిటికల్ విషయాలు ఆపాదించవద్దు అంటూ ఆమె తెలిపింది. అయితే ఇంత చేసినా సరే..కామెంట్స్ చేస్తామంటే చేయండి.. మీరు కొట్టుకు చావండి అంటూ అప్పట్లోనే ట్వీట్ చేసింది. అయితే ఇదంతా ఫిబ్రవరిలోనే జరిగిపోయింది.. అయితే ఇప్పుడు ఎలక్షన్ లు మే 13వ తేదీన జరిగిన నేపథ్యంలో మరొకసారి జనసేన వర్సెస్ వైసీపీ అంటూ పోటీ జరుగుతున్న నేపథ్యంలో మరొకసారి కొంతమంది ఈ వీడియోలను తీసి మళ్లీ వైరల్ చేశారు..

- Advertisement -

కొట్టుకు చావండి.. నాకు మంచి ఎంటర్టైన్మెంట్..

ఇక తాజాగా వీటిపై ఈమె క్లారిటీ ఇచ్చింది.. సాహితీ మాట్లాడుతూ కింద వీడియోలు చేయడానికి లైటింగ్ సరిగ్గా రాలేదు.. అందుకని టెర్రస్ పైకి వెళ్ళాను.. అయితే అక్కడ వెనుకల జగన్ గారి ఆఫ్ స్మైల్ ఫేస్ మాత్రమే కనిపిస్తోంది.. అది నేను గమనించలేదు.. కానీ కొంతమంది దానిని చూసి.. నేను వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అంటూ వైరల్ చేస్తున్నారు.. ఆ తర్వాత నేను దాన్ని డిలీట్ చేశాను.. నిజానికీ అప్పట్లోనే నేను క్లారిటీ ఇచ్చాను.. మీరు ఇంకా గొడవ పడతామంటే నాకు సంబంధం లేదు.. నాకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అంటూ వదిలేస్తాను అంటూ ఆమె చెప్పుకు వచ్చింది.. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు మళ్ళీ వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు