Star Couple : భార్య పేరుతో ఉన్న టాటూను తొలగించిన స్టార్ హీరో… పిక్ వైరల్

Star Couple : ఇటీవల కాలంలో సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువగా విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అందరి కళ్ళు ప్రస్తుతం స్టార్ కపుల్ గా ఉన్న జంటలపైనే ఉన్నాయి. అందులో భాగంగానే ఇటీవల దీపికా పడుకొనే, రణవీర్ సింగ్ లు విడాకుల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇంస్టాగ్రామ్ లలో వాళ్ళ పెళ్లి పిక్స్ కన్పించకపోవడంతో ఈ రూమర్లు చెలరేగాయి. ఇక జీవి ప్రకాష్ కూడా తాజాగా తన భార్యకు విడాకులు ఇస్తున్నట్టు వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీ కపుల్ కు సంబంధించిన ప్రతీ కదలికను గమనిస్తూనే ఉన్నారు. తాజాగా స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ హాట్ టాపిక్ గా మారారు. సైఫ్ అంతకుముందు తన చేతిపై కరీనా పేరుతో ఉన్న టాటూను తొలగించడంపై చర్చ నడుస్తోంది ఇప్పుడు.

కరీనా టాటూ రిమూవ్ చేసిన సైఫ్

సైఫ్ అలీఖాన్ ఎడమ చేతిపై తన భార్య కరీనా కపూర్ ఖాన్ పేరు మీద ఉన్న టాటూను తొలగించినట్లు తెలుస్తోంది. ఈ బాలీవుడ్ స్టార్ రీసెంట్ గా ముంబై విమానాశ్రయంలో కనిపించాడు. కరీనా పేరుతో ఉన్న టాటూ ప్లేస్ లో కొత్తగా త్రిశూలాన్ని టాటూగా వేసుకుని కంపించాడు సైఫ్. ఇక ఎయిర్ పోర్ట్ లో ఆయన ఆ టాటూను దాచే ప్రయత్నం చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సైఫ్ అలీ ఖాన్ ఎయిర్‌పోర్ట్‌లో జీన్స్‌తో తో పాటే సాదా నీలిరంగు టీ-షర్ట్ ధరించాడు. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మాత్రం అతని ఎడమ చేతిపై కరీనా పేరుతో ఉండాల్సిన టాటూ లేదు.

- Advertisement -

క్లారిటీ ఇవ్వని సైఫ్..

అయితే ఆ టాటూను ఏదైనా సినిమా కోసం కవర్ చేశాడా? లేదంటే మొత్తానికే తొలగించాడా? అనే విషయంపై సైఫ్ క్లారిటీ ఇవ్వలేదు. సైఫ్ అలీఖాన్ 2008లో కరీనా పేరుతో టాటూ వేయించుకున్నాడు. ఇది తన నిబద్ధతను చూపించే మార్గమని చెప్పాడు. కరీనా, సైఫ్ డేటింగ్ చేస్తున్న కొత్తలో సైఫ్ అలీ ఖాన్ హిందీలో కరీనా పేరును తన ముంజేయిపై టాటూగా వేయించుకున్నాడు. వీరిద్దరూ తర్వాత 2012లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇప్పుడు ఇద్దరు కుమారులు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ ఉన్నారు.

సైఫ్ సినిమాల విషయానికొస్తే..

సైఫ్ అలీ ఖాన్ దేవర అనే పాన్ ఇండియా మూవీలో కీలకపాత్రను పోషిస్తున్నాడు. ఆయనకు తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ. ఈ పాన్ ఇండియా చిత్రంలో సైఫ్ అలీఖాన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ కూడా దేవర తోనే అడుగు పెట్టబోతోంది.

ఇక ఈ సినిమాలతో పాటే సైఫ్ సిద్ధార్థ్ ఆనంద్ తో కూడా ఓ సినిమా చేయనున్నాడు. ప్రియదర్శన్‌తో కూడా సైఫ్ చర్చలు జరుపుతున్నాడు. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ అంధుడిగా కన్పించబోతున్నాడు. ప్రియదర్శన్ జూలై, ఆగస్టులో సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు. సైఫ్ అలీఖాన్ చివరిగా ఆదిపురుష్‌లో కనిపించాడు. ఇందులో ప్రభాస్, కృతి సనన్, దేవదత్తా నాగే మరియు సన్నీ సింగ్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు