Nani New Movie : నాని సినిమాకు ఫైనాన్షియల్ ఇష్యూ… మధ్యలో ఆగిపోయిన సినిమా ?

Nani New Movie.. నాచురల్ స్టార్ నాని మూవీకి కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. ఇంకా సినిమా పట్టాలెక్కక ముందే కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది అనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. అసలు విషయంలోకి వెళితే.. నాని, సుజీత్ సింగ్ దర్శకత్వంలో డివివి దానయ్య మూవీస్ బ్యానర్ పై #Nani 32 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు.. అయితే తాజాగా ఈ సినిమా ప్రస్తుతానికి లేదు అన్నట్లు తెలుస్తోంది.. దీనికి కారణం బడ్జెట్ లెక్కలు మ్యాచ్ కాకపోవడం వల్లే సినిమాని హోల్డ్ లో పెట్టామంటూ చిత్ర బృందం ప్రకటించింది.

Nani New Movie : Financial issue for Nani movie... movie stopped in the middle?
Nani New Movie : Financial issue for Nani movie… movie stopped in the middle?

నాని సినిమాకు ఫైనాన్షియల్ ఇష్యూ

ఇకపోతే ఈ ఏడాది మొదట్లోనే నాని ఈ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నాని కనిపించబోతున్నట్లు వార్తలు కూడా వినిపించాయి.. అంతేకాదు ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు చిత్ర బృందం కూడా స్పష్టం చేసింది ..ఒక క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ కాగా మరొక క్యారెక్టర్ ఏంటి అనేది సస్పెన్షన్ లో ఉంచారు సజీత్.. ఇక ఈ సినిమా కనుక మంచి విజయం సాధిస్తే తాను అనుకున్నట్టుగానే స్టార్ హీరో అయిపోతానని ఎన్నో కలలు కన్నారు నాని.. అంతేకాదు సుజిత్ డైరెక్షన్లో వచ్చే ఏ సినిమాలోనైనా సరే హీరో కచ్చితంగా టైర్ వన్ హీరోగా మారుతారు అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో చేస్తున్న నాని కూడా ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అయితే టైర్ వన్ హీరోగా మారిపోతారంటూ వార్తలు కూడా వినిపించాయి.. అంతేకాదు అభిమానులలో కూడా భారీగా అంచనాలు పెరిగిపోతాయి.. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అందుకు ఉంటుందని నాని కూడా టైర్ వన్ హీరోల జాబితాలో చేరిపోతాడని అభిమానులు కూడా అనుకున్నారు.. కానీ ఇప్పుడు ఆ కలలన్నీ నిరాశగానే మిగిలిపోతున్నాయి.. బడ్జెట్ కారణంగానే ఈ సినిమా ఆగిపోయింది అని ఇప్పుడు సమాచారం.. ఏది ఏమైనా ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్న నాని .. ఇప్పుడు బడ్జెట్ కారణంగా తన కలలకి కళ్లెం వేసుకుంటున్నారని తెలిసి అభిమానులు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

నాని ప్రస్తుత చిత్రాలు..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ నాని గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు ఈ సినిమా తర్వాత బలగం సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న డైరక్టర్,ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ వేణు డైరెక్షన్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ సినిమా తర్వాతనే సుజిత్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది కానీ ఇప్పుడు బడ్జెట్ కారణంగా ఈ సినిమా కూడా ఆగిపోయిందని సమాచారం మరి ఈ సినిమాను పూర్తిగా ఆపేస్తారా ..?లేక బడ్జెట్ కుదిరాకా మళ్ళీ మొదలు పెడతారా? అన్నది ఇప్పుడు అభిమానులలో ప్రశ్నార్థకంగా మారింది. ఇకపోతే నానినే కాదు అభిమానులు కూడా అంచనాలు పెట్టుకోగా ఇప్పుడు అందరి అంచనాలను డివివి దానయ్య హోల్డ్ లో పెట్టేసారు. మరి ఏ మేరకు ఈ సినిమా పెట్టాలెక్కుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు