Prabhas : ఆ పాట విన్న వెంటనే కళ్ళలో నీళ్లు వచ్చేసాయి

Prabhas : ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో ప్రభాస్ ఒకరు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ స్థాయి ఏ రేంజ్ కి వెళ్ళిపోయిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ లోని చాలామంది ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను మిస్ అయ్యారని తెలిసిందే. అయితే ప్రభాస్ ఇప్పుడు మారుతీ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బాహుబలి సినిమాకు ముందు బాహుబలి తర్వాత

ఇక ప్రభాస్ విషయానికొస్తే బాహుబలి సినిమాకు ముందు బాహుబలి సినిమా తర్వాత అని చెప్పొచ్చు. బాహుబలి సినిమాకు ముందు ప్రభాస్ చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశాయి. ప్రభాస్ లోని కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యులేషన్ ఇవన్నీ కూడా విపరీతంగా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. అయితే బాహుబలి తో స్టార్ట్డం వచ్చిన తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ కూడా పూర్తిస్థాయి సంతోషాన్ని అభిమానులకు ఇవ్వలేదని చెప్పొచ్చు.

ఎక్స్పరిమెంటల్ సినిమాలు

ప్రభాస్ చేసిన డార్లింగ్, బుజ్జి గాడు, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాల్లో ఆ క్యారెక్టర్స్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే కేవలం ఇటువంటి సినిమాలు మాత్రమే కాకుండా ఎక్స్పరిమెంటల్ సినిమాలు కూడా చేశాడు ప్రభాస్. ప్రభాస్ కెరియర్ లో వచ్చిన సినిమాల్లో చక్రం సినిమా గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఆ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా కూడా ఇప్పటికీ చాలామందికి ఒక ఫేవరెట్ ఫిలిమ్ అని చెప్పొచ్చు. ఆ సినిమాకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

- Advertisement -

Prabhas Chakram

పాట కోసమే సినిమా

కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా హిట్ కాలేదు కానీ ఈ సినిమా కాన్సెప్ట్ మాత్రం చాలామందికి కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో జగమంత కుటుంబం నాదే అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలియంది కాదు. అయితే కేవలం ఈ పాట కోసమే కృష్ణవంశీ ఈ సినిమాను తీశాను అని చెబుతూ ఉంటారు. ఈ మాటను చాలా ఏళ్ల క్రితమే సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసుకున్నారు. ఈ పాటను ఎవరికీ ఇవ్వకుండా ఈ పాట కోసం తాను సినిమా చేస్తానని చెప్పి కృష్ణవంశీ తీసుకొని సినిమాను చేశారు.

ఆ పాట నా అదృష్టం

ఇకపోతే ఒక ప్రముఖ మీడియా ఛానల్ సిరివెన్నెల సీతారామశాస్త్రి పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రోగ్రాంను నిర్వహించింది. ఆ ప్రోగ్రాం కి చాలామంది అతిధులను ఆహ్వానించింది. దానికి ప్రభాస్ కూడా హాజరయ్యి చక్రం సినిమాలోని ఈ పాట తనకు చాలా ఇష్టమని, ఈ పాటలో నేను కనిపించడం, నా అదృష్టం అని ఈ పాట విన్న వెంటనే తనకు ఏడుపొస్తుంది అంటూ చెప్పుకొచ్చారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు