Kannappa : శివుడుగా బాలయ్య మిస్… మూవీలో ఈ నందమూరి హీరో లేకపోవడానికి రీజన్ ఏంటంటే?

Kannappa : మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “కన్నప్ప” కోసం తెలుగు సినీ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచు మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మహా భారత్ సీరియల్ డైరెక్టర్లలో ఒకరైన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాన్ ఇండియా రేంజ్ స్టార్ కాస్ట్ నటిస్తుండడంతో ఇండియా వైడ్ గా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మొదట ఈ సినిమా గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు గాని, ఎప్పుడైతే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథలో ఎంటర్ అయ్యాడో అప్పటినుండి ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కి వెళ్లిపోయాయి. ఇక తాజాగా నిన్న (జూన్ 14) “కన్నప్ప” (Kannappa) అఫిషియల్ టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ చేయగా నెట్టింట మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.

Balakrishna missed the role of Lord Shiva in Kannappa

భారీ తారాగణంతో కూడిన టీజర్…

ఇక ‘కన్నప్ప’ టీజర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుండగా, ఈ టీజర్ లో స్టార్ కాస్ట్ భారీగా కనిపించడం జరిగింది. ఆల్మోస్ట్ పాన్ ఇండియా స్టార్లను ఒక్క టీజర్ లో అద్భుతమైన షాట్స్ తో చూపించేసారు. ఇక ఈ సినిమా టీజర్ లో విష్ణు తర్వాత వరుసగా మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ సహా అందర్నీ చూపించేసాడు. ఒక్కో స్టార్ కి ఒక్కో విధంగా చూపిస్తూ, సినిమాపై హైప్ ని పెంచేశారు. ఇక టీజర్ లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమారే శివుడిగా నటితున్నాడని కన్ఫర్మ్ అయిపోగా, ప్రభాస్ మరో శివుడి పాత్రలో, లేదా నందీశ్వరుడి పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఇక మోహన్ లాల్ ఆటవిక తెగల నాయకుల్లో ఒకరిగా గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నారు. అలాగే గూడెం నాయకుడిగా శరత్ కుమార్ నటిస్తున్నారు. అయితే ఈ టీజర్ లో అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించగా ఈ రోల్ ని ముందుగా ఓ స్టార్ హీరో చేయాల్సి ఉంది.

- Advertisement -

శివుడి రోల్ చేయాల్సిన బాలయ్య.. ఎందుకు వదులుకున్నాడంటే…

ఇక కన్నప్ప టీజర్ లో అక్షయ్ కుమార్ శివుడి పాత్ర చేయగా, నిజానికి ఆ పాత్ర చేయాల్సింది నందమూరి బాలకృష్ణట. అసలు వివరాల్లోకి వెలితే ఈ చిత్రంలో కీలకమైన విభిన్నమైన పాత్రలో ప్రభాస్ ని ఎంచుకున్న తర్వాత, కన్నప్ప నిర్మాత మోహన్ బాబు శివుడి పాత్ర కోసం నందమూరి బాలకృష్ణను సంప్రదించారట. అయితే, ఎన్నికలు, డేట్ల సమస్యల కారణంగా ఆయన అంగీకరించలేకపోయాడని సమాచారం. ఫలితంగా బాలయ్య వదులుకున్న శివుడి పాత్రలో చివరికి అక్షయ్ కుమార్ నటించారు. ఇక పరమ శివుడి పాత్ర కోసం అక్షయ్ కుమార్ పది రోజులు షూటింగ్ లో పాల్గొనగా, దాని కోసం 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నాడు అక్షయ్. ఇక రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నా, తెలుగు ప్రేక్షకులని మాత్రం భక్త కన్నప్ప సినిమా స్థాయిలో కన్నప్ప ఆకట్టుకుంటాడా లేదా అన్న అనుమానం మొదలయింది. ఇక ఈ సినిమాలో సాంగ్స్ ఎలా డిజైన్ చేసారో తెలీదు గాని, పాటల విషయంలో ఏమాత్రం తేడా వచ్చిన తెలుగు సినీ ప్రేక్షకులు దారుణంగా రిజెక్ట్ చేస్తారని నెటిజన్లు అంటున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు