Nagarjuna Upcoming Movie : నా సామి రంగ కాంబో రిపీట్… నాగ్ సైలెన్స్ వెనకున్న సీక్రెట్ ఇదేనా?

Nagarjuna Upcoming Movie : కింగ్ నాగార్జున రీసెంట్ గా నా సామిరంగ మూవీతో థియేటర్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన నెక్స్ట్ మూవీ ఏంటన్న విషయంపై ఇప్పటిదాకా క్లారిటీ లేదు. తాజా సమాచారం ప్రకారం నా సామిరంగ కాంబో రిపీట్ కాబోతోందని తెలుస్తోంది. మరి ఇంతకీ నాగ్ ప్లాన్ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…

విజయ్ బిన్నీతో మరోసారి..

సక్సెస్ కోసం కష్టపడుతున్న తరుణంలో నాగార్జునకు నా సామిరంగ మూవీతో డీసెంట్ హిట్ ఇచ్చిన కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ విజయ బిన్నీ. ఈ యంగ్ డైరెక్టర్ తోనే నాగ్ మరోసారి మూవీ చేయబోతున్నారని సమాచారం. అంటే నా సామిరంగ మూవీ కాంబో రిపీట్ కాబోతుందన్నమాట. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ తో విజయ్ బిన్నీ బిజీగా ఉండగా, ఈ ఏడాదే షూటింగ్ స్టార్ట్ కాబోతోందని సమాచారం. ఇక నా సామిరంగ మూవీని నిర్మించిన శ్రీనివాస చిట్టూరి మరోసారి కొత్త ప్రాజెక్టుకు కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే విజయ్ బిన్ని నాగార్జున కోసం ఒక కొరియన్ మూవీని రీమేక్ చేయబోతున్నాడట. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఆ మూవీలో మార్పులు చేర్పులు చేసి జూన్ లోగా స్క్రిప్టును ఫైనల్ చేయబోతున్నారని సమాచారం. జూలైలోగా ఈ మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేసి, 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్టుగా ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

సంక్రాంతి విన్నర్ గా నాగ్..

కింగ్ నాగార్జున నటించిన రీసెంట్ సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. ఆయన గత చిత్రం నా సామిరంగ తప్ప. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ తో కలిసి నాగార్జున చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యింది. ఆయనకు కలిసి వచ్చిన సంక్రాంతి సీజన్ కే థియేటర్లలోకి వచ్చి ఈ మూవీతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు నాగ్. స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో సంక్రాంతికి థియేటర్లలోకి దిగి, 2024 సంక్రాంతి విన్నర్స్ లిస్టులో సెకండ్ ప్లేస్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో ప్రేక్షకులు నాగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే రొమాంటిక్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉండడంతో పాటు పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందింది ఈ మూవీ. పైగా ఇందులో రాజ్ తరుణ్, అల్లరి నరేష్ వంటి యంగ్ హీరోలు కీలక పాత్రలు పోషించడం విశేషం.

- Advertisement -

ముందే ఫిక్స్ అయ్యారా?

ఇక ఈ మూవీ తర్వాత నాగ్ నెక్స్ట్ మూవీ ఏంటి? అనే ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతోంది. నా సామిరంగ మూవీ ఈవెంట్ లో నెక్స్ట్ సంక్రాంతికి మళ్లీ కలుసుకుందాం అంటూ హింట్ ఇచ్చారు నాగర్జున. అయితే ఆయన ఏ డైరెక్టర్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు అనే విషయంపై క్లారిటీ రాలేదు. తాజాగా మరోసారి నా సామిరంగ టీం రిపీట్ కాబోతోంది అనే రూమర్ల నేపథ్యంలోనే విజయ్ బిన్నీతో మరో మూవీ చేయాలని నాగ్ అప్పుడే ఫిక్స్ అయ్యారని అన్పిస్తోంది. ప్రస్తుతం నాగ్ కుబేరలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు