Ram Charan : పదేళ్ల కింద ఉన్న స్పీడు ఇప్పుడేమైంది?

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” తర్వాత వరుస సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సాన తో, ఆ తర్వాత సుకుమార్ తో భారీ సినిమాలు చేయనున్నాడు. అయినా సరే అభిమానులు నిరాశలో ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ లు ఫిక్స్ అయ్యి ఏడాది పైనే అయింది. కానీ ఇంకా షూటింగ్ కాలేదు. చరణ్ అభిమానులను ఇబ్బంది పెడుతుంది ఇదే. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే.. రామ్ చ‌ర‌ణ్ తన మొత్తం కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కూ ఒకే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేసింది కేవ‌లం రెండు సార్లు మాత్రమే చోటు చేసుకుంది. అది ఒకసారి 2013 లో `నాయ‌క్`..`తుఫాన్` చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ఆ త‌ర్వాత మ‌రుస‌టి సంవత్స‌ర‌మే ‘ఎవ‌డు’,’గోవిందుడు అంద‌రివాడే’ చిత్రాల రిలీజ్ తో అభిమానుల ముందు కొచ్చారు. ఆ త‌ర్వాత చ‌ర‌ణ్ ఒకే ఏడాది రెండు రిలీజ్ ల జోలికి వెళ్లింది లేదు. ఏడాదికే ఒక సినిమానే రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. RRR మొదలైన తర్వాత అది కూడా లేదు. కానీ ఇలా ఏడాదికి ఒక సినిమా చేస్తే ప‌న‌వ్వ‌దు. వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయాలి. అప్పుడే టాప్ ప్లేసులో నిలవగలడు. అంతకు మించి అభిమానులని కూడా సంతృప్తి పరచగలగాలి.

వాళ్ళలా జోరు పెంచేదెప్పుడు?

అయితే చరణ్ తోటి హీరోలైన డార్లింగ్ ప్ర‌భాస్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లు మాత్రం వరుస సినిమాలు లైన్లో పెట్టారు. ఇక ఎన్టీఆర్ కెరీర్ బిగినింగ్ నుండి స్పీడ్ గా సినిమాలు చేస్తూ ఏకంగా స్టార్ హీరోల్లో అందరికంటే ఎక్కువ సినిమాలు చేసాడు. ఇక ప్రభాస్ చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. నిజానికి ఆర్ఆర్ఆర్ త‌ర్వాత `గేమ్ ఛేంజ‌ర్` తోనే చ‌ర‌ణ్ టైంపాస్ చేస్తున్నాడని అభిమానాలు నిరాశ పడుతున్నారు. ఇక చరణ్ ఇటీవ‌లే బుచ్చిబాబు తో త‌న 16వ చిత్రం..సుకుమార్ తో 17వ చిత్రం ప్రారంభించారు. కానీ అవి ఇంకా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కాలేదు. జూన్ నుంచి 16వ చిత్రం ఆన్ సెట్స్ కి వెళ్తుంది అంటున్నారు. కానీ అందులో క్లారిటీ లేదు. మ‌రోవైపు గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్ ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చిందో కూడా క్లారిటీ లేదు. పైగా ఆ సినిమా మొదలై ఏకంగా మూడున్నరేళ్లు దాటింది. ఎప్పుడొస్తుందో కూడా తెలీని పరిస్థితి. అయితే చ‌ర‌ణ్ ఇలా నెమ్మ‌దిగా సినిమాలు చేయ‌డంపై విమ‌ర్శ కూడా వ్య‌క్త‌మ‌వుతుంది. మిగతా హీరోల్లా అతడెందుకు ప్లాన్ చేసుకోలేక‌పోతున్నాడు? అని ప్ర‌ధానంగా వినిపిస్తోంది.

చరణ్ స్పీడు పెంచేదెప్పుడు?

ఇక చరణ్ (Ram Charan) ఫ్రెండ్స్ ప్ర‌భాస్ ఒకేసారి రెండు, మూడు షూటింగ్ ల‌కు హాజ‌ర‌వుతున్నాడు. తార‌క్ కూడా `దేవ‌ర‌`తో పాటు `వార్ -2` లో జాయిన్ అవుతున్నాడు. అంత వరకు ఎందుకు, చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి రోజుకి మూడు షిప్టులు ప‌నిచేసిన న‌టుడు. ఒకే ఏడాది మూడు..నాలుగు రిలీజ్ చేసిన సంద‌ర్భాలున్నాయి. కంబ్యాక్ త‌ర్వాత కూడా ఒకే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేసిన రికార్డు ఆ సీనియ‌ర్ స్టార్ కి ఉంది. మ‌రి చ‌ర‌ణ్ అలా ఎందుకు ప్లాన్ చేసుకోలేక‌పోతున్నారు? ప్రాజెక్ట్ లు క‌మిట్ అవ్వ‌డంలో…రిలీజ్ చేయ‌డంలో జాప్యం దేనికంటూ? సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌తంలో ఇదే త‌ర‌హా విమ‌ర్శ‌లు యంగ్ టైగ‌ర్ కూడా ఎదుర్కున్నారు. ఇప్పుడు వరుస సినిమాల్లో సందడి చేస్తున్నాడు. మరి చరణ్ ఇప్పుడలా బిజీ అవుతాడు. ఏడాదికి రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేస్తాడని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు