Ananya Nagalla : ఈ తెలుగమ్మాయికి పెద్దగా ఫిజిక్, గ్లామర్ లేకపోయినా.. అదొక్కటి ఉన్నవాడు కావాలట.

Ananya Nagalla : మామూలుగా పెళ్లి చేసుకునే అమ్మాయిలు, ప్రతి అబ్బాయిలో, లేదా పెళ్లి చేసుకునే వాడిలో ర‌క‌ర‌కాల క్వాలిటీలు కోరుకుంటారు. వారి హైట్, వెయిట్, మంచి ఫిజిక్, గ్లామ‌ర్ ఇలా ప్ర‌తీది తమకు న‌చ్చేలా ఉండాలనుకుంటారు. అలాగే అబ్బాయిలు కూడా. ఇది కామనే. ఇక అన్ని ర‌కాలుగా త‌న‌ని మ్యాచ్ చేసేలా ఉండాల‌ని ప్ర‌తీ అమ్మాయి కోరుకుంటుంది. ఇక వివాహం త‌ర్వాత బాగా చూసుకోవాల‌ని..వెకేష‌న్ల‌కు తీసుకెళ్లాల‌ని… ప్ర‌పంచ‌మంతా తిప్పి చూపించాల‌ని ఆశ‌ప‌డే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. అందులోనూ వారు సెలెబ్రెటీ లు అయితే వారి అసలు అంతుండదు. చిత్ర విచిత్రంగా వాళ్ళ కోరికలను చెప్తూ ఉంటారు. కానీ ఈ తెలుగు హీరోయిన్ మాత్రం అందరికి భిన్నంగా ఆలోచిస్తుంది. ఈ హీరోయిన్ కి హైట్ అవ‌సరం లేదు, వెయిట్ తో సంబంధం లేదు, మ‌రీ అంత గ్లామ‌ర్ గా ఉండాల్సిన ప‌ని కూడా లేదట. ప్ర‌పంచ‌మంతా తిప్పాల్సిన ప‌నిలేదు. మ‌రి ఆ హీరోయిన్ కి కావాల్సింది? ఏంటి ? అంటే విచిత్రంగా జవాబిచ్చింది.

పెళ్లి చేసుకునే వాడికి అది ఉండాలట?

అయితే ఆ హీరోయిన్ పెళ్లి చేసుకునే వాడికి డిఫరెంట్ గా హీరోల్లాగా సిక్స్ ప్యాక్ లు, హెయిర్ స్టైల్స్ లు, కలర్ లు పెద్దగా ఉండాల్సిన పనిలేదట. ఆ హీరోయిన్ కి కావాల్సింది ఏంటి అంటారా? అంటే గెడ్డం అంట. అవును ఆ హీరోయిన్ పెళ్లి చేసుకునే వాడికి పుల్ గా బీయ‌ర్డ్ ఉండాలట‌. అంతే కాదు అందంగా మీస‌క‌ట్టు కూడా ఉండాలిట‌. ఈ రెండు ఉంటే చాలు నేను ప్లాట్ అయిపోతానంటోంది ఆ భామ. అలాంటి వాడినే కోరుకుంటానని ఆ తెలుగు హీరోయిన్ అంటుంది. ఆ భామ ఎవరో కాదు తెలుగు హీరోయిన్ అన‌న్య నాగ‌ళ్ల‌. ముఖంలో..బాడీ లో మ‌రే పీచ‌ర్ తో సంబంధం లేకుండా మ‌న‌సుకు నచ్చితే గెడ్డం కుర్రాడిని పెళ్లాడిస్తేనంటోంది. గ‌తంలో ‘హాయ్ నాన్న’ సినిమాలో నాని పాత్ర లాంటి వ్య‌క్తిత్వం ఉన్న కుర్రాడు కావాలి అని అనన్య అంది. అంటే అలాంటి కుర్రాడికి గెడ్డం.. తో పాటు మీసం అద‌నంగా ఉండాలని తాజాగా జోడించిది అన్న మాట‌. రిలేష‌న్స్ షిప్స్ అంటే ఎప్పుడూ ఓ స్నేహంలా ఉండాల‌ని..అది భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య అయినా అలాంటి స్నేహం ఉండాలి అంటోంది. అప్పుడే ఆ బంధాలు కల‌కాలం నిల‌బ‌డ‌తాయ‌ని అభిప్రాయ‌ప‌డింది.

వరుస సినిమాలు.. అయినా కెరీర్ స్లో..

ఇక అనన్య నాగళ్ళ (Ananya Nagalla) ప్రస్తుతం తెలుగు హీరోయిన్లలో బిజీ గా ఉన్న భామల్లో ఒకరు. కెరీర్ మొదట్లో మంచి సినిమాలు చేసినప్పటికీ, ఇప్పుడు స్క్రిప్ట్ సెలెక్షన్స్ పరంగా అంతగా ఫోకస్ చెయ్యట్లేదు. ఇక అన‌న్య కెరీర్ సోసోగా సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ‘మ‌ల్లేషం’ నుంచి మొన్న‌టి అన్వేషి వ‌ర‌కూ ఆరేడు సినిమాలు చేసింది. వీటిలో పెద్ద చిత్రం ‘వ‌కీల్ సాబ్’. అందులో అమ్మ‌డు ఓ కీల‌క పాత్ర పోషించింది. కానీ కెరీర్ ప‌రంగా అది పెద్ద‌గా క‌లిసి రాలేదు. ‘మ‌ల్లేషం’ ఇమేజ్ తోనే అవ‌కాశాలు అందుకుంది. రీసెంట్ గా తంత్ర సినిమాతో ప్లాప్ అందుకుంది అనన్య. ప్ర‌స్తుతం అమ్మ‌డు ‘పొట్టేలు’ అనే చిత్రంలో న‌టిస్తోంది. మరి వరుస ప్లాపుల్లో ఉన్న ఈ భామకు కెరీర్ బూస్టప్ హిట్ ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు