OTT Series : కూతుర్నే వేశ్యగా మార్చాలనుకునే తల్లి… ఓటిటిలో ఈ సిరీస్ ను ఇంకా చూడలేదా?

OTT Series : ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఓ వెబ్ సిరీస్ లో ఏకంగా తల్లే తన కూతురును వేశ్యగా మార్చాలని చూస్తుంది. ఓటిటిలో దుమ్ము రేపుతున్న వెబ్ సిరీస్ ఆ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలను తీయడంలో ఆరితేరిన డైరెక్టర్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటిదాకా ఆయన రూపొందించిన బాజీరావు మస్తానీ, పద్మావత్ లాంటి సినిమాలే అందుకు నిదర్శనం.  ఇక ఇలాంటి భారీ సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి తాజాగా తన ఫస్ట్ వెబ్ సిరీస్ ను రిలీజ్ చేశారు. హీరామండి ది డైమండ్ బజార్ పేరుతో తాజాగా రిలీజ్ అయిన ఈ సిరీస్ ఓటిటిలో సంచలనంగా మారింది. పాపులర్ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో హీరామండీ ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, అదితి రావు హైదరి లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన హీరామండీ స్టోరీ విషయానికి వస్తే…

స్వాతంత్రం రావడానికంటే ముందు లాహోర్ లో ఉన్న ఒక ప్రాంతం పేరే హీరామండీ. ప్రస్తుతం ఇప్పుడు ఆ ప్రాంతం పాకిస్థాన్ లో ఉంది. నిజానికి హీరామండీ అనేది వేశ్యలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. హీరామండి సిరీస్ కూడా వేశ్యల కథ ఆధారంగానే తెరకెక్కింది. అప్పట్లో హీరామండిలో ఉన్న వేశ్యల జీవిత కథనే వెబ్ సిరీస్ గా తెరకెక్కించారు డైరెక్టర్ సంజయ్. అప్పట్లో హీరామండిలో స్థిరపడిన వేశ్యలకు రాజకుటుంబంతో సంబంధాలు కొనసాగేవట. అయితే మల్లికా జాన్ అనే ఓ వేశ్య జీవితం చుట్టూనే ఈ స్టోరీ తిరుగుతుంది.

- Advertisement -

షాహీ మహల్ అనే వేశ్యా వాటికకు పెద్దగా వ్యవహరిస్తుంది మల్లికా జాన్. ఆమెకు వహీదా అనే సోదరి ఉంటుంది. అలాగే మల్లికాకు బిజోజాన్, ఆలంజేబు అనే ఇద్దరు కూతుర్లు ఉంటారు. ఫరీదాన్ అనే వేశ్య మరో మహల్ ఖ్వాభాగ్ కు పెద్దగా ఉంటుంది. ఇక మల్లికా, ఫరీదాకు ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. అయితే మల్లికా జాన్ తన చిన్న కూతురు ఆలంజేబును వేశ్య వృత్తిలోకి దింపాలని అనుకుంటుంది. కానీ ఆలంజేబు బాలోచీ నవాబు తాజ్ దార్ తో ప్రేమలో ఉండడం వల్ల దానికి ఒప్పుకోదు. ఈ విషయం ఇద్దరి ఇళ్లలో తెలుస్తుంది.

ఇక ఇదంతా గమనిస్తున్న మల్లికా జాన్ సోదరీ వహీదా తన అక్కకు బుద్ధి చెప్పాలని భావించి, ఆమె అంటే అస్సలు పడని ఫరీదాతో చేతులు కలుపుతుంది. మరోవైపు మల్లికా జాన్ పెద్ద కూతురు బిబోజాన్ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా గూడచారిగా స్వాతంత్ర పోరాటం చేస్తూ ఉంటుంది. ఇవన్నీ తెలుసుకున్న ఫరీదా.. వహీదా సాయంతో షాహి మహల్ ను దక్కించుకోవడానికి ఎలాంటి పన్నాగాలు పన్నింది? మల్లికా జాన్ వాటిని ఎలా ఎదుర్కొంది? ఫరీదా పెద్ద కూతురు బ్రిటిషర్లకు దొరికిపోయాక పరిస్థితి ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ఆలంజేబు ప్రేమాయణం ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే హీరామండి వెబ్ సిరీస్ ను చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు