Salaar 2 Update : సలార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ సర్ప్రైజ్… ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్

Salaar 2 Update : బాహుబలి తర్వాత వరుసగా డిజాస్టర్లు అందుకుంటున్న ప్రభాస్ కు సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన మూవీ సలార్ సీజ్ ఫైర్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రెండవ పార్ట్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే అటు రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు, ఇటు యంగ్ టైగర్ అభిమానులకు కిక్ ఇచ్చే వార్త ఒకటి వైరల్ అవుతోంది. సలార్ 2లో ఎన్టీఆర్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఇంతకీ ఇద్దరు పాన్ ఇండియా హీరోలతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

ప్రభాస్ తో తారక్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడా?

ఈ భారీ బడ్జెట్ మూవీలో ఇప్పటికే ప్రభాస్, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సలార్ 2లో కొందరు పాన్ ఇండియా స్టార్ లతో సర్ప్రైజ్ ఇవ్వాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఓ వార్త వైరల్ అవుతుంది. నిజానికి ఎప్పటి నుంచో శౌర్యంగా పర్వం మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కీ రోల్ లో కనిపించబోతున్నాడని తాక్ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆ వార్త నిజమేనని అంటున్నారు. తారక్ ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఓ సీక్వెన్స్ లో ఎంట్రీ ఇస్తాడని, దాన్ని ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ మూవీకి స్టార్టింగ్ పాయింట్ గా ఉపయోగించుకుంటాడనే వార్త వినిపిస్తోంది. ఈ వార్తతో సలార్ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొత్తానికి ప్రశాంత్ నీల్ కూడా తన యూనివర్స్ ను క్రియేట్ చేసుకునే పనిలో పడ్డారన్నమాట. కాగా సలార్ 2 తరువాత ప్రశాంత్ నీల్ తారక్ తో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే.

సలార్ 2 షూటింగ్ ఎప్పుడంటే?

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ సలార్. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రభాస్ ను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించి రెబెల్ స్టార్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపేసింది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ మూవీని కేవలం అందులోని పాత్రలను పరిచయం చేయడానికి మాత్రమే ఉపయోగించుకున్నాడు. అసలు స్టోరీ అంతా సెకండ్ పార్ట్ శౌర్యంగపర్వం లోనే ఉంటుందని చెప్పడంతో దానిపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

- Advertisement -

ముఖ్యంగా సలార్ పార్ట్ 2లో వరదరాజ మన్నార్ కు తన స్నేహితుడే శత్రువుగా మారడం, వీళ్లిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని చూడడానికి ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.  ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్ సెకండ్ పార్ట్ షూటింగ్ మేలో లేదా జూన్ నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే శౌర్యంగపర్వం మూవీకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు