Family Man Season3 : సీజన్ 3 లో సమంత ఉన్నట్టా? లేనట్టా? క్లారిటీ ఇదే!

Family Man Season3 : ఇండియా లో లాక్ డౌన్ తర్వాత ఓటిటి లు ఊపందుకున్న తర్వాత వెబ్ సిరీస్ లో కూడా ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. అయితే అందులో పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన వెబ్ సిరీస్ లలో “ఫ్యామిలీ మ్యాన్” కూడా ఒకటి. మనోజ్ బాజ్‌పేయ్ ప్రధాన పాత్రలో ఇండియన్ క్రైమ్ బ్రాంచ్ స్పై గూఢచారిగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఓటిటి లో భారీ విజయం సాధించింది. ఇప్పటికే రెండు సిరీస్ లు వచ్చి ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించగా, చాలా రోజుల తర్వాత లేటెస్ట్ గా మూడో పార్ట్ యొక్క అనౌన్స్ మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకద్వయం మేకర్స్ అయిన తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే ఈ విషయంపై తీపి క‌బురు చెప్పారు. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఒరిజినల్ సిరీస్ మూడవ సీజన్ చిత్రీకరణ కోసం అన్ని ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తోంది. ఈ ఫ్రాంఛైజీలో సీజ‌న్ 1, సీజ‌న్ 2 ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించాయి. రాజ్ & DK వారి బ్యానర్ D2R ఫిలిమ్స్ లో ఇప్పుడు సీజ‌న్ 3ని కూడా తెర‌కెక్కిస్తున్నారు. యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ లో సీజన్ 2 క్లైమాక్స్ ప్రశంసలను పొందింది. ఇక సీజన్ 3 కొన‌సాగింపు అంత‌కంటే థ్రిల్లింగ్ గా ఉంటుందని సమాచారం.

సీజన్ 3 లో సమంత ఉందా?

ఇదిలా ఉండగా సీజన్ 2లో ఎల్.టి.టి.ఇ తీవ్ర‌వాది రాజీ పాత్ర‌లో సమంత నటించిందన్న విషయం తెలిసిందే. రాజీ పాత్ర‌లో స‌మంత న‌ట‌న‌కు అద్భుత స్పంద‌న ద‌క్కింది. సీజన్ 2 హిట్ కావడానికి సమంత పాత్ర కూడా ఒక కారణం. అందుకే ఈ పాత్ర‌కు కొన‌సాగింపు ఉంటుంద‌ని, ఫ్యామిలీమ్యాన్ సీజన్ 3 లో స‌మంత‌కు ప్రాధాన్య‌త ఉంటుంద‌ని ఊహించారు. కానీ ఇప్పుడు రాజీ పాత్రతో ప‌ని లేద‌ని టాక్ వినిపిస్తోంది. ఫ్యామిలీమ్యాన్ 3 లో స‌మంత న‌టించ‌డం లేదని వార్తలు వస్తున్నాయి. అందుకే ఇటీవ‌ల ‘ఫ్యామిలీమ్యాన్ సీజన్ 3’ ప్ర‌క‌ట‌న‌లో ఎక్క‌డా కాస్టింగ్ లో త‌న పేరు క‌నిపించ‌లేద‌ని వాదిస్తున్నారు. ఒక‌వేళ స‌మంత ఇత‌ర షెడ్యూల్ ల బిజీ వ‌ల్ల పార్ట్ 3లో క‌నిపించ‌డం లేదా? అన్న డౌట్ కూడా ఉంది. లేక‌పోతే ఛాన్స్ మిస్స‌యిందా? ఆ పాత్రను తొల‌గించారా? అంటూ రకరకాలుగా చ‌ర్చ సాగుతోంది. సీజ‌న్ 3 కాస్టింగ్ లో మ‌నోజ్ భాజ్ పేయి, ప్రియ‌మ‌ణి స‌హా ఇత‌ర కీల‌క పాత్ర‌ల పేర్లు క‌నిపించినా కానీ స‌మంత పేరు ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

సమంత ఉంటుందా?

అయితే సమంత తనకున్న జబ్బు నుండి కోలుకుని వరుసగా సినిమాలు చేయడం ప్రారంభించింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ బాలీవుడ్ ప్రాజెక్టులేవీ ప్ర‌క‌టించ‌లేదు. తెలుగులో ఒకే ఒక్క‌టి.. అది కూడా సొంత బ్యాన‌ర్ సినిమా (బంగారం) ని స‌మంత ప్ర‌క‌టించింది. అయితే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2  క్లైమాక్స్ లో సమంత హెలికాఫ్టర్ లో హీరో టీమ్ పైకి దాడిచేస్తూ తప్పించుకునే క్రమంలో దూరంగా హెలికాఫ్టర్ పేలిపోయినట్టు చూపించి ఎండ్ చేసారు. అయితే అందులో సమంత ఉండి లేనట్టు చూపించారు. బహుశా రాజి పాత్ర అందులోనుంచి తప్పించుకుని కూడా ఉండొచ్చు. అదే నిజమైతే సీజన్ 3 (Family Man Season3) లో సమంత పాత్ర ఎంట్రీ ఉండే అవకాశం ఉంది. అయితే సీజన్ 3 మేకర్స్ నుండి క్లారిటీ వచ్చే వరకు ఏమి చెప్పలేం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు