Suriya – Jyothika: పుత్రికోత్సాహం తో కోలీవుడ్ జంట.. ఇంతకీ ఏం చేసిందంటే..?

Suriya – Jyothika.. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న సూర్య – జ్యోతిక దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇద్దరు కూడా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు.. ఒకవైపు తమిళ్ చిత్రాలు చేస్తూనే మరొకవైపు తెలుగు చిత్రాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. ఇదిలా ఉండగా తాజాగా ఈ దంపతులు పట్టరాని ఆనందంలో ఉన్నట్లు తెలుస్తోంది.. తమ కూతురు సాధించిన విజయానికి గర్విస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం సాధించింది ?వారి సంతోషానికి గల కారణం ఏమిటి ?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

Suriya - Jyothika: Kollywood couple with daughter's enthusiasm.. What have they done so far..?
Suriya – Jyothika: Kollywood couple with daughter’s enthusiasm.. What have they done so far..?

పిల్లల కోసమే ముంబై కి..

ముంబై కి చెందిన జ్యోతిక సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదిగి తమిళ సినిమాలలో నటించేటప్పుడు సూర్యతో ప్రేమలో పడింది… ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ..2007లో వివాహం చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు ఒక కూతురు , ఒక కొడుకు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. ఇకపోతే వివాహం అనంతరం ఇండస్ట్రీకి దూరమైన జ్యోతిక ఇద్దరు పిల్లలకు తల్లి అయి వారి ఆలనా పాలనా చూసుకుంటూ వచ్చింది .. ప్రస్తుతం పిల్లల పెద్దవాళ్లు కావడంతో మళ్లీ నటనపై దృష్టి సారించింది ఈ ముద్దుగుమ్మ. ఇక పిల్లల భవిష్యత్తు నిమిత్తం వీరిద్దరూ పిల్లలతో కలిసి ముంబైలో సెటిల్ అయిన విషయం కూడా తెలిసిందే.

కూతురు చేసిన పనికి పట్టరాని సంతోషంలో జ్యోతిక- సూర్య..

ఇకపోతే ముంబైకి వెళ్ళిన తర్వాత జ్యోతిక బాలీవుడ్ సినిమాలలో నటించడం మొదలుపెట్టింది. ఇక్కడ బాలీవుడ్లో అవకాశాలు అందుకుంటూ మరింత పేరు సొంతం చేసుకుంటుంది.. ఇకపోతే వీరి పిల్లల చదువుపై గట్టిగా ఫోకస్ చేశారు ఈ స్టార్ కపుల్స్… అందులో భాగంగానే ముంబైలో చాలామంది బిలీయనీర్ల పిల్లలు చదువుకునే ధీరుభాయి అంబానీ స్కూల్లో తమ ఇద్దరు పిల్లలను ఈ జంట చదివిస్తున్నారు. ఇక ఏడాది వారి కూతురు గర్వించే పని చేసినట్లు తెలుస్తోం.ది ఈ సంవత్సరం నటి జ్యోతిక, నటుడు సూర్యా దంపతుల కుమార్తె దియా 12వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసింది. ఆమె స్కోర్ గురించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అంతేకాదు ఆ స్కోర్ చూసి తల్లిదండ్రులు ఇద్దరు గర్విస్తున్నట్లు సమాచారం..

- Advertisement -

600 మార్కులకు 581..

12వ తరగతిలో దియా 600 మార్క్ లకు గానూ 581 మార్కులు సాధించినట్లు తెలుస్తోంది.. లాంగ్వేజ్ లో 96 మార్కులు, ఇంగ్లీషులో 97 మార్కులు, ఫిజిక్స్లో 99 మార్కులు ,కెమిస్ట్రీ లో 98 మార్కులు, అకౌంట్స్ లో 94 మార్కులు , కంప్యూటర్ సైన్స్ లో 97 మార్కులు సాధించింది.. దీంతో అభిమానులు సూర్య జ్యోతిక కుమార్తెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు .. ఈ స్టార్ జంట ఈ హ్యాపీ మూమెంట్ ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.. సెలబ్రిటీలు సైతం ఈ జంటకు అలాగే దియా కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికైతే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సూర్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తుండగా.. జ్యోతిక కూడా హిందీలో సినిమాలు చేస్తూ.. నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు