Krishnamma : సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ బిజినెస్ డీటెయిల్స్.. తక్కువైనా.. ఇలాంటి పరిస్థితుల్లో కొట్టాలి!

Krishnamma : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో సత్యదేవ్ ఒకరు. కేవలం హీరోగానే కాకుండా, బడా స్టార్ హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేస్తూ, ప్రతినాయక పాత్రలు కూడా చేస్తూ విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు. ఇక తాజాగా సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం “కృష్ణమ్మ” రిలీజ్ కి రెడీ అవుతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కృష్ణమ్మ సినిమా టీజర్, ట్రైలర్ ఈ మధ్యనే రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సత్యదేవ్ కెరీర్ లో ఇదో డిఫరెంట్ మూవీగా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇక వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పిస్తున్న ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందించారు. ఇక రీసెంట్ గా రాజమౌళి తో పాటు, అనిల్ రావిపూడి, బాబీ, గోపీచంద్ మలినేని గెస్ట్ లుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగింది. ఫైనల్ గా కృష్ణమ్మ మే 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

కృష్ణమ్మ బ్రేక్ ఈవెన్ బిజినెస్..

ఇక ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా తర్వాత మళ్ళీ మరో సక్సెస్ కొట్టలేదు సత్యదేవ్. మధ్యలో కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించినా విజయం మాత్రం దక్కలేదు. ఫైనల్ గా కృష్ణమ్మ తో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఓ మంచి బాక్స్ ఆఫీస్ సక్సెస్ కోసం సత్యదేవ్ ఇంకా ఎదురు చూస్తున్నాడు అని చెప్పాలి. కాగా ఇలాంటి టైంలో కొరటాల శివ లాంటి టాప్ డైరెక్టర్ నిర్మాణ సమర్పణలో కృష్ణమ్మ తో ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా బిజినెస్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఇక కొన్ని చోట్ల అడ్వాన్స్ లతో సినిమాని రిలీజ్ చేస్తుండగా, మరి కొన్ని చోట్ల ఓన్ గా రిలీజ్ కానున్న కృష్ణమ్మ మూవీ, బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కి వాల్యూ టార్గెట్ కావాలి అంటే, ఓవరాల్ రిలీజ్ అండ్ సత్యదేవ్ ప్రీవియస్ మూవీస్ రేంజ్ ను బట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 4 కోట్ల రేంజ్ లో షేర్ ని కనుక సొంతం చేసుకుంటే డీసెంట్ హిట్ గా నిలుస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఏరియా వారీగా సినిమా బిజినెస్ వివరాలు మాత్రం తెలియలేదు.

ప్రెజెంట్ టైం లో గట్టిగా కొట్టాలి..

ఇక ఈ (Krishnamma) సినిమా ట్రైలర్ లోనే సినిమా కథ ఎలా ఉండబోతుంది అన్నది క్లియర్ గా చెప్పగా, రివేంజ్ యాక్షన్ మూవీగా సినిమా ఉండబోతుందని ట్రైలర్ లోనే తెలిసి పోయింది. ఇక సినిమా బిజినెస్ పరంగా చాలా వరకు ఓన్ గానే రిలీజ్ కానుంది. ప్రజెంట్ ఉన్న పొలిటికల్ హీట్, సమ్మర్ టైం, అలాగే IPL ఎండ్ స్టేజ్ కి రావడం లాంటి అడ్డంకులు ఉండగా, ప్రజెంట్ సమ్మర్ టైంలో ఆడియన్స్ ను థియేటర్స్ పెద్దగా రప్పించే సినిమాలు పెద్దగా రావడం లేదు. కనుక ఈ సినిమాకి టాక్ పాజిటివ్ గా వస్తే మాస్ ఆడియన్స్ అండతో అంచనాలను అందుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ సినిమా సత్యదేవ్ ఓ మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి ఇప్పుడు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు