Aadavari Matalaku Arthale Verule: 17 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే… అప్పట్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసా?

Aadavari Matalaku Arthale Verule : వెంకీ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయిన సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామా ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే. ఈ మూవీ రిలీజ్ అయ్యి నేటికి అంటే ఏప్రిల్ 27కి సరిగ్గా 17 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం.

ఇవే హైలెట్స్..

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో శ్రీ సాయి దేవ ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్ వి ప్రసాద్, శానం నాగ అశోక్ కుమార్ నిర్మించిన ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అప్పటిదాకా ఎన్నో ప్రేమ కథలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల్లో వెంకీ నటించినప్పటికీ, ఈ మూవీ అన్నింటికంటే ప్రత్యేకమని చెప్పొచ్చు. ఈ మూవీ మరో స్పెషల్ ఏమిటంటే కల్ట్  స్పెషలిస్ట్ అయిన సెల్వ రాఘవన్ తెలుగులో ఓ స్టార్ హీరోతో చేసిన ఏకైక సినిమా ఇదే. అలాగే వెంకీ, త్రిష కాంబో ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. అంతేకాకుండా కలర్స్ స్వాతి అపరిపక్వ ప్రేమ కథ, తండ్రి కొడుకులుగా నటించిన వెంకీ, కోట కాంబినేషన్ సీన్స్, వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్స్, కామెడీ, ప్రేమ సన్నివేశాలు అద్భుతంగా పండాయి. అలాగే పాటలు కూడా ప్రత్యేకమే.

ఎన్ని భాషల్లో రీమేక్ అయ్యిందంటే?

ఇక బెస్ట్ హీరోగా వెంకటేష్ కు, బెస్ట్ యాక్టర్ గా కోటా శ్రీనివాసరావ్ కు పలు అవార్డులను సొంతం చేసుకున్న ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మూవీ తమిళం, కన్నడ, భోజ్ పురి, ఒరియా భాషలో రీమేకై, అక్కడ కూడా సక్సెస్ అయ్యింది. అప్పట్లోనే 30 కోట్ల వసూళ్లు సాధించిన హిట్ మూవీ గా వెంకటేష్ కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ మూవీ. మరి ఫుల్ రన్ లో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మూవీకి వచ్చిన కలెక్షన్స్ ఎంత అనే వివరాల్లోకి వెళితే…

- Advertisement -

ఏరియా వైజ్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మూవీ కలెక్షన్స్…

ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మూవీ అప్పట్లో 13.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసి, 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్లలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసే సరికి 18.10 కోట్ల షేర్ ను రాబట్టి, బయ్యర్లకు 4.3 కోట్ల లాభాలు మిగిల్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఏరియా వైజ్ ఈ మూవీ కలెక్షన్స్ ఎంతంటే? నైజాంలో 6.8 కోట్లు, సీడెడ్ లో 1.93 కోట్లు, ఉత్తరాంధ్ర 2.59 కోట్లు, ఈస్ట్ 9.92 కోట్లు, వెస్ట్ 0.97 కోట్లు, నెల్లూరు 0.87 కోట్లు, కృష్ణ 1.57 కోట్లు, గుంటూరు, 1.63 కోట్లు, ఏపీ ప్లస్ తెలంగాణలో టోటల్ గా కలిపి 17.28 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ లో కలిపి 0.82 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 18.10 కోట్ల కనెక్షన్లు రాబట్టింది ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మూవీ. ఇక ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుండడంతో గత కొంతకాలంగా ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మూవీకి సీక్వెల్ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు వెంకటేష్ ఫాన్స్. మరి సీక్వెల్ ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు