Tollywood: పెళ్లి చేసుకున్న బుల్లితెర హీరో..!

పెళ్లి అంటే నూరేళ్లపంట. ఏడడుగుల నిత్యజీవితం. 100 సంవత్సరాల జీవిత బంధం. అనునిత్యం ఆలుమగలు… జీవితాంతం జీవించే క్షణం పెళ్లి. ఒక్కసారి మూడు ముళ్ళు వేశాక… చచ్చిపోయే వరకు కలిసిమెలిసి ఉండాల్సిందే. అది మన హిందూ ధర్మం స్పష్టంగా చెబుతోంది. అయితే…ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఒక్కో సెలబ్రిటీ తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసి… పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. హీరోయిన్లు కావచ్చు, హీరోలు కావచ్చు, బుల్లితెర నటీనటులు కావచ్చు… సడన్గా సర్ప్రైజ్ ఇచ్చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటున్నామని కొంతమంది… పెళ్లి చేసుకోబోతున్నామని కొంతమంది… పెళ్లి చేసుకొని మరికొంతమంది షాక్ ఇస్తున్నారు. మొన్న కరోనా సమయం నుంచి ఇప్పటివరకు పదుల సంఖ్యలో టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు.

అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో జంట పెళ్లి పీటలెక్కింది. తాజాగా టాలీవుడ్ బుల్లితెర హీరో ఆకర్ష్ బైరమూడి వివాహం చేసుకొని… అందరికీ షాక్ ఇచ్చాడు. ఆకర్ష వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు, సీరియల్ తారలు, స్నేహితులు అలాగే కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు. బుల్లితెర నటుడు ఆకర్ష్ వివాహానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

- Advertisement -

ఈ వీడియోని చూసిన తెలుగు ప్రేక్షకులు అతనికి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఈ హీరో చేసుకున్న యువతి ఎవరు అంటూ సెర్చ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… బుల్లితెర హీరో ఆకర్ష్… తెలుగులోనే కాకుండా కన్నడంలో కూడా చాలా సీరియల్స్ చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఇతగాడికి తెలుగులో మహిళల ఫాలోయింగ్ బాగానే ఉంది. మామగారు, అత్తగారింట్లో చెల్లిళ్ళు, పున్నాగ లాంటి సీరియల్ లో కనువిందు చేశాడు ఈ యంగ్ నటుడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు