Anasuya: రూ.500 కోసం అలాంటి పని.. కట్ చేస్తే లక్షల్లో ఆదాయం..!

Anasuya.. గ్లామర్ బ్యూటీ అనసూయ అనగానే వెంటనే అందరికీ గుర్తొచ్చే విషయం జబర్దస్త్.. దాదాపు 9 సంవత్సరాలుగా జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా పనిచేసి.. ఆ తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ఇక వెండితెరపై చిన్న చిన్న పాత్రలు చేసిన ఈమె సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా నటించి ఒక్కసారిగా తన ఫేట్ మార్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.. అలా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి సత్తా చాటింది అనసూయ ..

Anasuya: Such work for Rs. 500.. If you cut the income in lakhs..!
Anasuya: Such work for Rs. 500.. If you cut the income in lakhs..!

రూ.500 కోసం అలాంటి పని..

కాస్త సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ అందాలతో గ్లామర్ షో చేస్తూ యువతను ఆకట్టుకోవడమే కాదు అదే సోషల్ మీడియాలో సమాజంలో జరిగే ప్రతి విషయం పైన కూడా స్పందిస్తూ అప్పుడప్పుడు ట్రోల్స్ కి కూడా గురవుతూ ఉంటుంది.. అంతేకాదు అలా ట్రోల్స్ కి తనను గురి చేసిన వారిపై గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ఇదిలా ఉండగా తాజాగా అనసూయకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. అనసూయ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో రూ.500 కోసం అలాంటి పని చేసింది అంటూ ఒక వార్త రాగా ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. మరి అనసూయ చేసిన ఆ పని ఏంటో ఇప్పుడు చూద్దాం..

నాగ సినిమాలో అవకాశం..

అనసూయ జబర్దస్త్ ద్వారానే తన కెరీర్ ను మొదలుపెట్టింది అని అందరూ అనుకుంటారు.. కానీ జబర్దస్త్ లోకి రాక ముందు ఆమె సాక్షి ఆఫీసులో న్యూస్ రీడర్ గా పనిచేసింది.. అయితే అంతకంటే ముందు ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది.. అనసూయ చదువుకునే రోజుల్లోనే నటిగా ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది.. ఈ క్రమంలోనే ఒక చిన్న పాత్ర లో నటించే అవకాశం వచ్చింది .. 2003లో ఎన్టీఆర్ హీరోగా పొలిటికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం నాగ.. సదా ఇందులో హీరోయిన్ గా నటించింది.. ఇందులో కాలేజీ స్టూడెంట్ గా అనసూయ నటించడం గమనార్హం..

- Advertisement -

డైలాగ్స్ లేవు..కానీ

ఇక్కడ ఈమెకు ఎలాంటి డైలాగ్స్ ఉండవు.. ఒక సన్నివేశంలో సునీల్ మాట్లాడుతుంటే.. ఆయన వెనుక అనసూయ మనకు కనిపిస్తుంది. ఈ పాత్ర చేసే సమయానికి ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే.. జూనియర్ కాలేజీలో చదువుకుంటుంది.. ఇక నాగ చిత్రంలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించిన అనసూయకు 500 రూపాయలు పారితోషకంగా చెల్లించారట చిత్ర బృందం. ఇకపోతే ఆ కాలంలో జూనియర్ ఆర్టిస్టులకు ఇచ్చే పేమెంట్ అంతే అని అందరూ ఆశ్చర్యపోతున్నారు..

అనసూయ ప్రస్తుత రేంజ్..

ఇక ఇప్పుడు అనసూయ రేంజ్ ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒక్కొక్క సినిమాకు సుమారుగా రూ.80 నుండి రూ.90 లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్న ఈమె.. ఒక్కొక్క షోకి రూ .3 నుండి రూ.4లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.. అంతేకాదు యాడ్స్ లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈమె సంపాదన ఏడాదికి రూ .కోటికి పైగానే ఉన్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు