IPL 2024 : ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన హీరోయిన్ కు ఐపీఎల్ టికెట్లు కొనిచ్చిన విజయ్?

IPL 2024 : IPL 2024 : ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ఫుల్ స్వింగ్ లో నడుస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్ కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో చాలావరకు సినిమా ఇండస్ట్రీకి నష్టం వాటిల్లుతోంది. అయితే కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది సెలబ్రిటీలు కూడా క్రికెట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన ఓ హీరోయిన్ కి ఐపీఎల్ టికెట్స్ కొనిచ్చిన విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక్కడ ఆశక్తికరమైన విషయం ఏమిటంటే ఏకంగా ఆ హీరోయినే ఈ విషయాన్ని బయట పెట్టింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే…

దళపతి విజయ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. విజయ్ ఇప్పటికే రాజకీయాల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. త్వరలో ఆయన చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పనున్నట్టు ఆయనే స్వయంగా చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసే సినిమాలు, విజయ్ కు సంబంధించిన ఇతర వార్తలు కూడా ఇట్టే వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిన ఓ స్టార్ హీరోయిన్ కు ఐపిఎల్ టికెట్లు కొనిచ్చాడు అనే వార్త వైరల్ అవుతోంది. ఆమె ఎవరో కాదు వరలక్ష్మి శరత్ కుమార్.

విజయ్ ఈ ఏడాది రెండు ఖరీదైన ఐపీఎల్ టిక్కెట్లు కొన్నాడు. అది కూడా వరలక్ష్మి శరత్‌కుమార్ కోసమే. ఈ విషయాన్ని స్వయంగా వరలక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. వరలక్ష్మి మాట్లాడుతూ ‘నేను చూసిన మొదటి రెండు ఐపీఎల్ మ్యాచ్‌ల టిక్కెట్లు దళపతి విజయ్ కొన్నాడు. తొలి మ్యాచ్ చెన్నైలో జరిగింది. ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్‌కే మధ్య పోరు జరిగింది’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

వరలక్ష్మి శరత్‌ కుమార్ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా ‘హనుమాన్’తో పాన్ ఇండియా సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ‘రేయాన్’ అనే సినిమా చేస్తోంది. ఇటీవల శబరి అనే సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మే 3న థియేటర్లలోకి వచ్చింది. కూతురు కోసం తల్లి చేసే పోరాటాన్ని డైరెక్టర్ అనిల్ కాట్జ్ ఇంట్రెస్టింగ్ గా రూపొందించారు. కానీ ఈ మూవీకి ఆడియన్స్ నుంచి పెద్దగా ఆదరణ దక్కలేదు. ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే… రీసెంట్ గా నికోలాయ్ సహదేవ్‌తో వరలక్ష్మి శరత్‌ కుమార్ నిశ్చితార్థం జరిగింది.

విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా 80 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకోగా, మిగతా పార్ట్ ను రష్యాలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, మోహన్, జయరామ్ తదితరులు నటిస్తుండగా, విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. కాగా విజయ్ నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో మూవీ చేయనున్నాడు అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు