Met Gala 2024 : మెట్ గాలా ఇది గోల కాదు.. మనీ ప్లాంట్… ఈ ఏడాది ఈవెంట్‌తో ఎంత సంపాదించారో తెలుసా?

Met Gala 2024 : ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2024. ఈ వేడుక మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో మే 6న కన్నుల పండుగగా జరిగింది. 2024 కాస్ట్యూమ్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిబిట్, స్లీపింగ్ బ్యూటీస్ : రీవాకనింగ్ ఫ్యాషన్ ఆధారంగా ఈ సంవత్సరం నిర్వాహకులు సెలబ్రిటీలు ధరించే దుస్తుల కోడ్ ను లేదా థీమ్ ను ‘ది గార్డెన్ ఆఫ్ టైమ్’ అని పెట్టారు.

మెట్ గాలాలో ఈ ఏడాది ఎంత సంపాదించారంటే?

మెట్ గాలా అనేది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ కోసం ఒక స్వచ్ఛంద కార్యక్రమం, నిధుల సమీకరణ కోసం నిర్వహించే ఈవెంట్. దీన్ని సాధారణంగా వార్షిక ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహిస్తారు. మెట్ గాలా ఉద్దేశ్యం మెట్స్ కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ కోసం డబ్బును సేకరించడం. ఈ సంవత్సరం ఈవెంట్ ద్వారా సుమారు $26 మిలియన్లు అంటే ఇండియన్ రూపీస్ లో రూ. 217 కోట్లకు పైగా సంపాదించినట్టు ఒక ప్రతినిధి తెలిపారు. గతేడాది ఈ ఈవెంట్ 22 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

మెట్ గాలా ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే?

మెట్ గాలాను 1948లో ఫ్యాషన్ ప్రచారకర్త ఎలియనోర్ లాంబెర్ట్ తన వార్షిక ప్రదర్శన ప్రారంభోత్సవానికి గుర్తుగా కొత్తగా స్థాపించబడిన కాస్ట్యూమ్ ఇన్‌స్టిట్యూట్ నిధుల కోసం స్థాపించారు. మొదటి గాలాలో పాల్గొనే వారికి విందు కూడా ఉండేది. అప్పట్లోనే టిక్కెట్లు ఒక్కొక్కటి $50 డాలర్ల ధరతో ఉండేవి. అప్పుడు మొదలైన ఈ ఈవెంట్ ను కొన్ని దశాబ్దాలుగా కంటిన్యూ చేస్తున్నారు. ఇది న్యూయార్క్ లో స్వచ్ఛంద సంస్థల కోసం నిర్వహించబడే అనేక వార్షిక ఈవెంట్‌లలో ఒకటి.

- Advertisement -

ఈ ఏడాది పెరిగిన టిక్కెట్ ధర

సమాచారం ప్రకారం ఇటీవలి కాలంలో గాలా టిక్కెట్ ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఈ సంవత్సరం టిక్కెట్ ధర $75,000 డాలర్లుగా నిర్ణయించారు. గత ఏడాది $50,000 డాలర్లుగా ఉంది. 2022లో $35,000 డాలర్లు ఉండగా, గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం టిక్కెట్ ధరలలో భారీ పెరుగుదల కన్పించింది. ఈవెంట్‌కు హాజరైనవారు టేబుల్స్ రిజర్వ్ చేయడానికి అయ్యే ఖర్చును కూడా భరించాల్సి వచ్చింది. గాలాలో 10-సీటర్ టేబుల్‌ను బుక్ చేసుకోవడానికి ఏకంగా $350,000 డాలర్లు అంటే రూ. 2.9 కోట్లు ఖర్చవుతుంది.

పాపులర్ సంస్థల స్పాన్సర్‌షిప్

గాలా ఈవెంట్ స్పాన్సర్‌ల నుండి డబ్బును సేకరిస్తుంది. ఇందులో ఈ సంవత్సరం కాండే నాస్ట్, లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ లోవే, టిక్‌టాక్ ఉన్నాయి. మునుపటి స్పాన్సర్‌లలో యాపిల్, ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి.

హోస్ట్ ఎవరు ?

జెండయా, జెన్నిఫర్ లోపెజ్, బాడ్ బన్నీ, క్రిస్ హేమ్స్‌వర్త్ 2024 మెట్ గాలాలో హోస్ట్‌లుగా కన్పించారు.

మెట్ గాలా 2024 లో పాల్గొన్న స్టార్స్

2024 మెట్ గాలాకు హాజరైన ప్రముఖ జాబితాలో జెండయా, కార్డి బి, నిక్కీ మినాజ్, కెమిలా కాబెల్లో, డోనాటెల్లా వెర్సేస్, ఆండ్రూ స్కాట్, జూడ్ లా, కైలీ జెన్నర్, నికోల్ కిడ్‌మాన్, కీత్ అర్బన్, ఎఫ్‌కెఎ ట్విగ్స్, తారాజీ పి డెబిక్, ఎలిజాబ్ ఉన్నారు. ఇంకా చార్లీ హున్నామ్, అలియా భట్, ఇషా అంబానీ, నటాషా పూనావాలా కూడా ఈ ఈవెంట్ లో మెరిశారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు