Murder in Mahim Review : మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ మర్డర్ ఇన్ మహీమ్ రివ్యూ

Murder in Mahim Review : విజయ్ రాజ్, అశుతోష్ రానా, శివానీ రఘువంశీలు ప్రధాన పాత్రలు పోషించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మర్డర్ ఇన్ మహిమ్. ఈ వెబ్ సిరీస్ లో సీఐడీ సీరియల్ లో హెడ్ గా కనిపించి మెప్పించిన ప్రత్యుమ్న, శివాజి శాతమ్ కీలక పత్రాలు పోషించారు. ఓటీటీ ప్లాట్ ఫారమ్ జియో సినిమా వేదికగా ఈ వెబ్ సిరీస్ మే 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ట్రైలర్ తో అంచనాలు పెంచిన మర్డర్ ఇన్ మహిమ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? అనేది చూద్దాం.

కథ

8-ఎపిసోడ్ల సిరీస్ మర్డర్ ఇన్ మహిమ్ లక్ష్మణ్ అకా ప్రాక్సీ అనే యువకుడి భయంకరమైన హత్యతో ప్రారంభమవుతుంది. ముంబైలోని మహిమ్ రైల్వే స్టేషన్‌లోని స్వలింగ సంపర్క వ్యభిచారానికి ప్రసిద్ధి చెందిన టాయిలెట్‌లో అతను చనిపోతాడు. నిజాయతీగా, కఠినంగా వ్యవహరించే పోలీసు శివ జెండే (విజయ్)ను ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి నియమిస్తారు. లక్ష్మణ్ స్నేహితుడు డానిష్/దినేష్ అతనికి హత్య గురించి పోలీసులకు ఏదో తెలియజేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారీ అతని మాట వినకుండా తరిమి కొడతారు. తరువాత డానిష్/దినేష్ కూడా హత్యకు గురైనప్పుడు దర్యాప్తు తీవ్రమైన మలుపు తీసుకుంటుంది.

మరోవైపు రిటైర్డ్ జర్నలిస్ట్ పీటర్ ఫెర్నాండెజ్ (అశుతోష్ రాణా) ఒకప్పుడు జెండేతో స్నేహం చేస్తాడు. తన కొడుకు సునీల్ స్వలింగ సంపర్కుడని భయపడి జెండే తో చేతులు కలపడానికి ప్రయత్నిస్తాడు. అనంతరం రెండు హత్యలలో సునీల్ అనుమానితుడు అవుతాడు. హత్య కేసును పరిశోధిస్తున్నప్పుడు జెండే ఎలాంటి దారుణమైన నిజాలను తెలుసుకున్నాడు ? సునీలే అసలు హంతకుడా? లేకపోతే అసలు దోషి ఎవరు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే జియోసినిమాలో మర్డర్ ఇన్ మహిమ్ చూడండి.

- Advertisement -

విశ్లేషణ

మర్డర్ ఇన్ మహిమ్ ట్రైలర్ పెంచిన అంచనాలను అందుకోలేదు. కథలో అసలైన సస్పెన్స్ లేదు. కొన్నిసార్లు అనవసరంగా సాగదీసినట్లు అనిపిస్తుంది. క్రైమ్-థ్రిల్లర్ డ్రామా, LGBTQIA+ కమ్యూనిటీ అంశాలు, హోమోఫోబియా వంటి విషయాల చుట్టే కథ తిరుగుతుంది. కథనం, కథ కన్ఫ్యూజింగ్ గా అన్పిస్తాయి. దర్శకుడు రాజ్ ఆచార్య దాదాపు ప్రతి ఎపిసోడ్‌లో కొత్త పాత్రలు, సబ్‌ప్లాట్‌లను పరిచయం చేస్తారు. దీంతో గందరగోళంగా అన్పిస్తుంది. అలాగే కొన్ని పాత్రలను బలవంతంగా జోడించారు. ఆచార్య ఒక సాధారణ క్రైమ్-థ్రిల్లర్‌ సిరీస్ ను తీయడంలో తడబడ్డాడు.

నటీనటులు..

నటీనటులు తమ పరిధి మేరకు బాగానే నటించారు. ముఖ్యంగా అశుతోష్ రానా, విజయ్ రాజ్‌ల సంతోషకరమైన స్నేహబంధం చూడదగ్గ ట్రీట్. జెండే తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు శివాజీ, రాజేష్ ఖట్టర్, శివాని రఘువంశీ తమ పాత్రలను చక్కగా పోషించారు. కొన్ని పాత్రలు మాత్రం ఎందుకు ఉన్నాయో కూడా అర్థం కాదు.

చివరగా.. మర్డర్ ఇన్ మహీమ్ అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఈ వీకెండ్ ఓ లుక్కేయొచ్చు. క్రైమ్-థ్రిల్లర్ డ్రామా, LGBTQIA+ కమ్యూనిటీ అంశాలపై ఇంట్రెస్ట్ ఉండే ప్రేక్షకులకు ఈ సిరీస్ ఎంతో కొంత నచ్చే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు