Yakshini on OTT : మగాళ్లను మోహంలో ముంచి చంపే రాక్షసి టైటిల్ తో బాహుబలి ప్రొడ్యూసర్ల సిరీస్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Yakshini on OTT : బాహుబలి నిర్మాతలు తెలుగులో తాజాగా హారర్ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ కు యక్షిణి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ కు సంబంధించిన ఫ్రీ లుక్ పోస్టర్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ శుక్రవారం రిలీజ్ చేసింది. అయితే అందులో నటించబోయే లీడ్ రోల్స్ కు సంబంధించిన లుక్స్ లేకుండా కేవలం షాడోను మాత్రమే చూపిస్తూ ఆసక్తిని పెంచేశారు. యక్షిని వస్తుంది అనే క్యాప్షన్ తో ఆ పోస్టర్ ను వదిలారు.

యక్షిణి అంటే మగాళ్లను మోహంలో ముంచి చంపి, వాళ్ళ అవయవాలు తినేసి, రక్తం తాగి తనను తాను యంగ్ గా మార్చుకునే ఒక రకమైన రాక్షసి. మరి ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటో చూడాలి. హారర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ వేదిక, రాహుల్ విజయ్, మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టైటిల్ పాత్రలో నటించబోయేది మాత్రం వేదిక అని సమాచారం. ఈ సినిమాలో ఆమె డి గ్లామర్ లుక్ లో కనిపించబోతుందని టాక్ నడుస్తోంది. హారర్ అంశాలతో ప్రతి ఎపిసోడ్ ఇచ్చేలా వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారట. సిరీస్ లోని ప్రతి పాత్ర కూడా మిస్టీరియస్ గా ఉండడమే కాకుండా హారర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను కచ్చితంగా భయపెడతారని అంటున్నారు.

ఈ హారర్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు తో పాటు ఒకేసారి హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. త్వరలోనే వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ ను ఏ డైరెక్టర్ రూపొందిస్తున్నారు? ఎన్ని ఎపిసోడ్లతో రాబోతోంది అన్న విషయాలపై ఆ టైంలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని యక్షిణి వెబ్ సిరీస్ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన విజయదశమి అనే మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన వేదిక బాణం, రూలర్, దూరంగా దగ్గరగా అనే సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. అయితే అన్ని సినిమాల కంటే ఆమె నటించిన కాంచన 3 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఏకంగా అరడజను సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె చేస్తున్న రెండు సినిమాలు ఫియర్, జంగిల్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ బ్యూటీ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కలిపి మరో ఆరు సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తోంది. మరి యక్షిణిగా ఆమె ఎలా ఉంటుందో చూడాలంటే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యేదాకా ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు