Aa Okkati Adakku : ఓపెనింగ్స్ తో ఆశపెట్టి.. వారంలో బయ్యర్లకు నీరు గార్చేసారు!

Aa Okkati Adakku : టాలీవుడ్ లో గత వారం రిలీజ్ అయిన క్రేజీ చిత్రాల్లో అల్లరి నరేష్ నటించిన “ఆ ఒక్కటి అడక్కు” సినిమా కూడా ఒకటి. అల్లరి నరేష్ చాలా రోజుల తర్వాత నటించిన కామెడీ సినిమా అవడంతో ఈ సినిమాపై మంచి క్రేజీ అంచనాలు ఉండగా, రిలీజ్ అయ్యాక మాత్రం ప్రేక్షకుల నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు నుండే పక్కాగా కామెడీ సినిమా గానే ప్రమోషన్ చేసారు. బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైంకి కామెడీ ఎంటర్టైనర్ తో వచ్చిన అల్లరి నరేష్ సినిమా థియేటర్లలో అంతంత మాత్రం అనే టాక్ తెచ్చుకున్నా, అల్లరి నరేష్ కోసం ఓ మోస్తరు ప్రేక్షకులు వచ్చారు. ఇక మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజీవ్ చిలక ‘చిలక ప్రొడక్షన్స్’ అనే బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించాడు. మే 3న ప్రసన్నవదనం, బాక్ సినిమాలతో పాటు పోటీగా రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది.

కామెడీ తో డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చారు?

ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల బీలో యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, ఓపెనింగ్స్ పరంగా నరేష్ ప్రీవియస్ మూవీస్ లో కాస్త బెటర్ ఓపెనింగ్స్ అందుకోవడంతో టాలీవుడ్ బయ్యర్లకి ఈ సినిమాపై ఆశ కలిగింది. అయితే ఈ సమ్మర్ లో రిలీజ్ అయినా కూడా ఎండలు, ఎలక్షన్స్ అలాగే IPL మ్యాచుల ఇంపాక్ట్ పడినప్పటికీ కూడా మొదటి మూడు రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనిపించేలా ఈ సినిమా ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమాకి కొంచం మిక్సుడ్ టాక్ వచ్చినా కూడా, ఆఫ్ లైన్ లో కూడా డీసెంట్ బుకింగ్స్ జరిగాయి. అల్లరి నరేష్ ప్రీవియస్ మూవీస్ కంటే ‘ఆ ఒక్కటీ అడక్కు’ కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ కూడా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 55 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు టాక్ ఇంకా బెటర్ గా వచ్చి ఉంటే కలెక్షన్స్ ఇంకా బెటర్ గా సొంతం చేసుకుని ఉండేది. ఇక మొదటి వీకెండ్ 1.60 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా బయ్యర్లపై ఆశలు పెంచింది. తక్కువ బిజినెస్ కావడం వల్ల లాంగ్ రన్ లో పికప్ కావచ్చని అనుకున్నారు.

వీకెండ్ లో ఆశ పెట్టి.. వారం లో నీరుగార్చేసారు..

ఆ ఒక్కటీ అడక్కు మూవీ వీకెండ్ లో బాగానే పెర్ఫార్మ్ చేసినా, వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అయింది. పెద్దగా హోల్డ్ ని చూపించ లేక పోయిన సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ కి దూరంగానే ఆగేలా చేశాయి. ఇక మొదటి వారంలో ఈ సినిమా సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే నైజాం లో 1.00 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ లో 1.26 కోట్లు కలిపి తెలుగు రాష్ట్రాల్లో 2.26 కోట్ల షేర్ రాబట్టగా, కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి మరో 34 లక్షలు రాబట్టింది. ఇక ఈ సినిమా తొలి వారం టోటల్ వరల్డ్ వైడ్ గా 2.60 కోట్ల షేర్ రాబట్టగా, 5.85 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ సినిమా వీకెండ్ లో డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టడంతో లాంగ్ రన్ లో పికప్ అయ్యి బాగా ఆడుతుందని బయ్యర్లు అనుకున్నారు. పైగా బిజినెస్ కూడా తక్కువే అయింది. కానీ సమ్మర్ ఎండలు, ఐపీఎల్ ప్రభావం వల్ల కలెక్షన్ల దెబ్బ పడింది. ఇక ఈ వారంలో థియేటర్లో వచ్చిన సినిమాల టాక్ ను బట్టి నరేష్ సినిమా రెండో వారంలో ఏమైనా ప్రభావం చూపిస్తుందా లేదా ఒక అంచనా కి రావచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు