OTT Movie : ఇంటి బెస్మెంట్ లో 13 దెయ్యాల కాపురం… వణుకు పుట్టించే ఈ హార్రర్ మూవీని చూస్తే నిద్ర పట్టడం కష్టం

OTT Movie : హారర్ అనే మాట వినిపిస్తే చాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు అలెర్ట్ అయిపోతారు. ఇక ఆ జానర్ లో వచ్చే సినిమాలంటే ఎంతో మంది ఇష్టపడతారు. ఎంత భయమేసినా చూడడం మాత్రం ఆపరు. కొంత మంది అయితే స్పెషల్ గా భయపెట్టే హారర్ సినిమాల కోసం తెగ వెతుకుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈరోజు ఓ హారర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఏకంగా బేస్మెంట్ లో 13 దయ్యాలు కాపురం ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు ఈ సినిమాను చాలా మంది చూసి ఉండరు. ఒకవేళ చూడాలి అనుకుంటే ఎలాంటి సబ్ స్క్రిప్షన్ అక్కర్లేకుండా ఫ్రీగానే వీక్షించొచ్చు.

ఈ మూవీ ఓటిటి ప్లాట్ఫామ్ తో పాటు యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది. కాబట్టి సబ్స్క్రిప్షన్ లేదన్న టెన్షన్ లేకుండా ఫ్రీగా యూట్యూబ్ లో చూసేయొచ్చు. కానీ ఎక్కువగా భయపడే వాళ్ళు మాత్రం ఈ మూవీని చూడకుండా ఉండడమే బెటర్. సాధారణంగా సినిమాలలో ఒకటి రెండు దయ్యాలు మాత్రమే ఉంటాయి కానీ ఇందులో ఏకంగా 13 దయ్యాలు ఉంటాయి కాబట్టి చూసే ముందు ఆలోచించండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు 13 ఘోస్ట్స్. 2001లో రిలీజ్ అయిన ఈ మూవీ హారర్ మూవీ లవర్స్ కు బెస్ట్ ఆప్షన్ అని చెప్పి తీరాలి. ఇక ఈ మూవీ దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో, అలాగే యూట్యూబ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక స్టోరీలోకి వెళ్తే… ఏ దయ్యం సినిమాలోనైనా దాదాపుగా ఒకే స్టోరీ ఉంటుంది. దయ్యం ఎవరినైనా ఆవహించడం, వాళ్ల నుంచి ఆ దయ్యాన్ని పారద్రోలడం. కానీ ఈ మూవీ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. 13 దెయ్యాలతో కలిపి ఒక గోస్ట్ హంటర్ ఊహించని ఓ ప్రయోగాన్ని చేయాలని ప్రయత్నిస్తాడు. అందుకోసం ఏకంగా 12 దయ్యాలను ఒకచోట బంధిస్తాడు. కానీ 13వ దయ్యాన్ని పట్టుకునే క్రమంలో అతను చనిపోతాడు.

- Advertisement -

అయితే అంతకంటే ముందే అతను చనిపోయాక తన బంధుమైన ఆర్ధర్ అనే వ్యక్తికి ఆ ఇల్లు చెందాలని వీలునామా రాస్తాడు. ఆర్థర్ అప్పటి వరకు కటిక పేదరికంతో బాధపడుతూ ఉంటాడు. విల్లులో ఆ ఇల్లు తనకే చెందుతుంది అని తెలియడంతో సంతోషంగా కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్తాడు. అప్పుడు మొదలవుతుంది ట్విస్ట్. ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన అసిస్టెంట్ ఆ ఇంటికి వచ్చి 12 దయ్యాలు ఇంటి బేస్మెంట్ లో ఉన్నాయని గుర్తించి ఆర్డర్ కి విషయం చెప్తాడు. ఆ తర్వాత వాళ్లు ఆ ఇంటిని విడిచి పెట్టి వెళ్ళారా? అసలు ఆ 12 దయ్యాల వల్ల వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి ? 13వ దయ్యం దొరికిందా ? చివరకు ఏం జరిగింది ? ఈ కథ సుఖాంతం అయ్యిందా? అనే విషయం తెలియాలంటే 13 ఘోస్ట్స్ మూవీని చూసి తీరాల్సిందే. ఇంకా చూడని వారు సబ్స్క్రిప్షన్ ఉంటే అమెజాన్ ప్రైమ్ లో, లేదంటే యూట్యూబ్ లో చూడండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు